Homeఎంటర్టైన్మెంట్Udumbu Movie Telugu Remake: "ఉడుంబు" రీమేక్ రైట్స్ కోసం పోటీ

Udumbu Movie Telugu Remake: “ఉడుంబు” రీమేక్ రైట్స్ కోసం పోటీ

Udumbu Movie Telugu Remake: మలయాళంలో మంచి విజయం సాధించిన “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చిత్ర దర్శకనిర్మాత కె.టి.తమరక్కుళం ప్రకటించారు. “ఉడుంబు” చిత్రాన్ని కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన “ఉడుంబు” మలయాళంలో అనూహ్య విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం పలువురు తెలుగు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరిచారు.

Udumbu Movie Telugu Remake
Udumbu Movie Telugu Remake

పలు అగ్రనిర్మాణ సంస్థలు “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ… ఇంకా ఈ చిత్రం హక్కులు ఎవరికీ ఇవ్వలేదని కె.టి.తమరక్కుళం స్పష్టం చేశారు. ఇప్పటివరకు మలయాళంలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన చిత్రాలు దాదాపుగా అన్నీ ఇక్కడ కూడా అఖండ విజయం సాధించాయి. విక్టరి వెంకటేష్ “దృశ్యం, దృశ్యం-2″లతోపాటు ఇటీవల విడుదలై అప్రతిహత విజయం సాధిస్తున్న “భీమ్లా నాయక్” ఇందుకు తాజా ఉదాహరణ.

Also Read:  పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!

అలాగే మెగాస్టార్ నటిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రం కూడా మలయాళంలో రూపొంది సంచలన విజయం సాధించిన “లూసిఫర్”కు రీమేక్ అన్న విషయం కూడా ఇక్కడ గమనార్హం. ఈ నేపధ్యంలో మళయాళంలో మంచి హిట్టయిన సినిమాలకు తెలుగులో మరింత క్రేజ్ ఏర్పడుతోంది.

Udumbu Movie Telugu Remake
Udumbu Movie Telugu Remake

భారీ తారాగణం లేకున్నా మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన “ఉడుంబు” చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా… తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు.

Also Read:  సుఖ ప్ర‌స‌వం కోసం కాజల్ స్పెషల్ వర్కౌట్స్

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Singer Revanth:  ‘మనో హరీ’ బాహుబలి సినిమాలోని రోమాంటిక్ పాటను లయ బద్దంగా పాడి శ్రోతల మనసు దోచుకున్నాడు సింగర్ రేవంత్. అతడి పాటలు తెలుగు నాట చాలా పాపులర్. సినిమాలు, ప్రమోషన్ పాటలే కాదు.. ‘సరిగమప’ లాంటి షోల్లోనూ సింగర్ రేవంత్ పాల్గొంటూ పాడుతూ అలరిస్తున్నాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular