
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక అంటేనే బయ్యర్లకు అతి నమ్మకం. సినిమాని ఎంత పెట్టి కొనడానికైనా వాళ్ళు వెనుకాడరు. అందుకే ‘పుష్ప’ కోసం ఇప్పటినుండే అడ్వాన్స్ లు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఎవరి దగ్గర అడ్వాన్స్ లు తీసుకోవడానికి రెడీగా లేదు. వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే సినిమాకి ఇప్పటి నుండే అడ్వాన్స్ లు ఎందుకు అనేది నిర్మాతల అభిప్రాయం.
అయితే, ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజుకి అమ్మేశారని టాక్. అందుకే మిగిలిన ఏరియాల బయ్యర్లు, మైత్రి మూవీ మేకర్స్ వెంట పడుతున్నారు. మరోపక్క ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కథలో రెండు పార్ట్స్ కి స్కోప్ ఉండేలా సుకుమార్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఎలాగూ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, బడ్జెట్ కూడా అంతే స్థాయిలో అవుతుంది.
అందుకే నిర్మాతలు బయ్యర్లు దగ్గర నుండి ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్ లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. రెండు పార్ట్స్ కాబట్టి, రెండు సినిమాల మార్కెట్ లెక్క. బడ్జెట్ ఎక్కువ అయినా ఈజీగా లాభాలు వస్తాయి. అందుకే ఈ సినిమా కోసం దిల్ రాజ్ లాంటి నిర్మాతలు ఎగబడి ముందుగానే కర్చీఫ్ లు వేసుకున్నారు. ఇక దేశంలో ఉన్న కరోనా సెకెండ్ వేవ్ కఠిన పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివర్లో ‘పుష్ప’ మొదటి భాగాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
దానికి తగినట్టుగానే సుక్కు షూటింగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే, వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. కాగా శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.