Homeఎంటర్టైన్మెంట్ఎదిగే కొద్దీ సొంత మనుషుల మధ్యే పోటీ !

ఎదిగే కొద్దీ సొంత మనుషుల మధ్యే పోటీ !

Allu Arjun Ram Charan
ఎదిగే కొద్దీ పోటీ అనేది మొదట కుటుంబంలోనే మొదలవుతుంది. ఇంకా ఎదుగుతున్న కొద్దీ తమ సొంత మనుషుల మధ్యే ఆ పోటీ వాతావరణం తెలియకుండానే చొరబడుతుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. చిన్నప్పటి నుండి తమలో తమకే తెలియకుండానే మంచి స్నేహపూర్వకమైన పోటీ ఉంటుందని గతంలో బన్నీనే స్వయంగా అన్నాడు. ఇప్పుడు ఆ పోటీ సినిమాల పరంగా కూడా కొనసాగుతుంది. ఇద్దరూ మంచి క్లోజ్ కజిన్స్ అయినా, ఇద్దరి మధ్య కాంపీటీషన్ కూడా మొదటి నుండి తీవ్రంగానే ఉంటూ వస్తోంది.

Also Read: పాపం మధ్యలో కాజల్ భర్తకే ఇబ్బంది !

ఫ్యాన్స్ లో కూడా బన్నీ ఫ్యాన్స్ అంటూ వేరు పడ్డారు అంటే, ఆ పోటీ అనేది ఎంతలా ఎదిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ మరో నేషనల్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా సినిమాని ఇప్పటికే అనౌన్స్ చేసి.. ఆ సినిమా పై కసరత్తలు మొదలెట్టాడు. అందుకే బన్నీ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైనప్ చేసే పనిలో పడ్డాడట. అందుకే, హడావిడిగా ప్రశాంత్ నీల్ తో మంతనాలు జరిపించాడు అని “పుష్ప” సినిమా షూటింగ్ పూర్తి కాగానే తన తరువాత సినిమాని ప్రశాంత్ నీల్ తో చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట.

Also Read: సల్మాన్ ప్రభావం.. ఎప్పుడూ అదే ఆలోచిస్తోందట !

కాకపోతే బన్నీ ఇంతకుముందే ప్రకటించిన కొరటాల సినిమాని ఎప్పుడు మొదలు పెడతాడు అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అంటే.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ అయితే మాత్రం, కొరటాలతో సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకునే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆలోచనే లేకపోతే.. ప్రశాంత్ నీల్ ని తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి రప్పించుకొని చర్చలు ఎందుకు జరుపుతాడు అంటున్నారు సినీ జనం ? ఏది ఏమైనా చరణ్ కి ధీటుగా బడా దర్శకులతో బన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయాలని తెగ ఉబలాట పడుతున్నాడు. ఎలాగూ ‘రంగస్థలం’ సినిమాతో చరణ్ రికార్డులు బ్రేక్ చేస్తే.. “అల వైకుంఠపురంలో”తో బన్నీ కొత్త రికార్డులు సెట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular