suicide attempt : కరోనా వచ్చాక సరిగ్గా షూటింగ్స్ లేవు, కొన్ని ఉన్నా అవకాశాలు ఇవ్వరు. మొత్తమ్మీద సినీ కార్మికులతో పాటు నటీనటులకు అనేక ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. రంగుల ప్రపంచంలోని బతుకులు అతలాకుతలం అయ్యాయి. ఇందుకు ఉదాహరణ.. ‘ది కపిల్ శర్మ షో’ కమెడియన్ తీర్థానందరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం.
తీర్థానందరావు ఆర్థిక సమస్యల కారణంగా విషం తాగి అందరికి షాక్ ఇచ్చాడు. చావుతో తన జీవితానికి ముగింపు పలకాలని ప్రయత్నించాడు తీర్థానందరావు. విషయం పొరుగు వారికి తెలియడంతో సమయానికి ఆస్పత్రిలో చేర్పించి అతన్ని బతికించారు. తీర్థానందరావు ఈ విషయం పై మాట్లాడుతూ.. ‘నా కుటుంబం కూడా నన్ను విడిచిపెట్టింది. ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు.
షూటింగ్స్ లేక ఇలా తీర్థానందరావు లాగా అనేకమంది దారుణమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రంగుల ప్రపంచంలో చీకటి కోణాలు చాలా దారుణంగా ఉంటాయని మరోసారి తీర్థానందరావు రూపంలో తెలిసి వచ్చింది. మనకు కృష్ణ నగర్ కష్టాలు లాగే బాలీవుడ్ కి కూడా ముంబై కష్టాలు అనేకం. ఫిల్మ్ కి సంబంధించి ఏదొక అసోసియేషన్ లో కూడా తీర్థానందరావు మెంబర్ కాదు. అందుకే అతనికి ఎలాంటి సాయం అందలేదు.