Raghu Karumanchi : టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లకు మంచి గుర్తింపు ఉంది. నాటి పద్మనాభం నుంచి నేటి వెన్నెల కిశోర్ వరకు కమెడియన్లు స్టార్లుగా ఎదిగారు. వీరిలో బ్రహ్మానందం, ఆలీలు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ నవ్వులు పూయిస్తున్నారు. తెలుగు సినిమాల్లో కనపించి ప్రతి ఒక్క కమెడియన్ కు తనకంటూ స్పెషలైజేషన్ ఉంది. కొందరు తమ మాటల ద్వారా.. మరికొందరు యాక్షన్ ద్వారా కడుపుబ్బా నవ్విస్తారు. కమెడిన్ రఘు మాత్రం తన ఆకారం ద్వారా.. ఇరిటేషన్ ద్వారా నవ్విస్తారు. అయితే రఘుకు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ కు చెందిన రఘు స్వస్థలం ఏపీలోని తెనాలి. ఆయన తండ్రి మాజీ సైనికాధికారి. రఘు ఎంబీఏ పూర్తి చేసిన తరువాత కొన్నాళ్లపాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేశారు. అయితే ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉండేది. ఈ నేపథ్యంలో సినిమాల్లో ఛాన్స్ కోసం తీవ్రప్రయత్నాలు చేశారు. చివరికి వివివినాయక్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో తాను ఆది సినిమా తీస్తున్న సమయంలో రఘుకు పిలుపు వచ్చింది.
జానియర్ ఎన్టీఆర్ కు కెరీర్ తిప్పిన ‘ఆది’ సినిమాలో రఘు మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చాడు. వచ్చీరాగానే ముఖ్యపైన కామెడీ విలన్ పాత్రలో నటించాడు. రాజీవ్ కనకాల అసిస్టెంట్ గా కనిపించిన రఘు తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. దీంతో ఆ తరువాత దిల్, కిక్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలసి ‘అదుర్స్’లో నటించిన తరువాత ఈయనకు స్టార్ గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుంచి వరుసగా దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించాడు.
సినిమాల్లో నటిస్తూనే వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు రఘు. ఆయనకు తెలంగాణ, ఆంధ్ర బార్డర్ లోని నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్ సమీపంలో రెండు వైన్ షాపులు ఉన్నాయి. అంతకుముందు షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రఘు తీవ్ర నష్టాల బారిన పడ్డాడు. ఒకసారి నష్టాన్ని భరించలేక ఇంట్లో టీవీ పగల కొట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రఘుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు స్వప్పిక, మరొకరు తేజస్వి. సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు పెడుతూ అలరిస్తున్నారు.