Comedian Ali apology to Hindus: ప్రముఖ కమెడియన్ అలీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. రీసెంట్ గానే ఆయన ఒక సబ్బుకు సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించాడు , అందులో ఆయన హిందువుల మనోభావాలను దెబ్బ తీసాడని సోషల్ మీడియా లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది బాగా వైరల్ అవ్వడం తో హిందూ సంఘాలు కూడా అలీ పై మండిపడ్డాయి. పూర్తి వివరాల్లోకీ వెళ్తే అలీ రీసెంట్ గా ఘర్ సోఫ్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లోని బ్యాక్ గ్రౌండ్ పవిత్రమైన లక్ష్మీ దేవి మంత్రాలు వినిపించాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేందుకు అలీ కి ఏ హక్కు ఉందని , తక్షణమే ఇతన్ని సినీ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే దీనిపై అలీ కాసేపటి క్రితమే క్షమాపణలు చెప్తూ వివరణ ఇచ్చాడు , అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘ఘర్ సోఫ్ యాడ్ లో దేవుడు చేసిన మనుషులు చిత్రం లోని ఒక చిన్న బిట్ ని రీ క్రియేట్ చేశాము. అది కొంతమందిని బాధ పెట్టిందని తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ యాడ్ ని తొలగించాము , ఎవరికైనా బాధ కలిగి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అలీ సినిమాల విషయానికి వస్తే, ఒకప్పుడు ఈయన టాప్ మోస్ట్ కమెడియన్ , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఎందుకో ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. అంతే కాకుండా రాజకీయాల నుండి కూడా ఆయన తప్పుకున్నాడు , గతం లో ఆయన వైసీపీ పార్టీ లో కొనసాగిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోవడం తో ఇప్పుడు అలీ బుల్లితెర పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ప్రస్తుతం స్టార్ మా చానెల్ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతుంది. వీటితో పాటు ఆయన పలు రియాలిటీ షోస్ కి కూడా జడ్జీ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అలీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
సోప్ యాడ్ వివాదంలో నటుడు అలీ
సబ్బుకి లక్ష్మీ పూజ చేసిన అలీ
బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న లక్ష్మీదేవి మంత్రాలు
హిందూ సంఘాల తీవ్ర అభ్యంతరం
అలీని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్
వివాదం ముదరడంతో క్షమాపణ చెప్పిన అలీ
గతంలో చేసిన ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా యాడ్… pic.twitter.com/Nsgbb8NHJn
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2026