Colors Swathi Divorce: కలర్స్ స్వాతి భర్తతో విడిపోయే ఆలోచలో ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీనికి ఆమె సోషల్ మీడియా బిహేవియర్ కారణమైంది. విడిపోయే జంటలు ఈ మధ్య ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇచ్చేస్తున్నారు. సమంత, నిహారికతో పాటు పలువురు సెలబ్రిటీలు విడాకులు ముందు ఒక కామన్ చర్యకు పాల్పడ్డారు. సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు మార్చేశారు. ఆమె పేరు నుండి అక్కినేని అనే సర్నేమ్ తొలగించారు. దాంతో నాగ చైతన్యతో విబేధాలు అనే పుకార్లు మొదలయ్యాయి.
ఈ ప్రచారం మొదలైన కొన్ని నెలల తర్వాత అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. నిహారిక-వెంకట చైతన్య విషయంలో కూడా ఇదే జరిగింది. నిహారిక భర్త వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించాడు. అలాగే నిహారికతో ఉన్న ప్రతి ఫోటో డిలీట్ చేశారు. వెంకట చైతన్య ఫోటోలు తీసేసిన కొద్దిరోజులకు నిహారిక కూడా పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడమైనది. ఆ విధంగా ఈ జంట హింట్ ఇచ్చారు. ఇటీవల వారు విడాకులు అప్లై చేశారు. ఇద్దరికీ అంగీకారం కావడంతో విడాకులు జారీ చేసినట్లు సమాచారం.

తాజాగా కలర్స్ స్వాతి ఇదే తరహా హింట్ ఇచ్చారు. స్వాతి ఇంస్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలు డిలీట్ చేయడం చర్చకు దారి తీసింది. భర్తతో విబేధాలు మొదలయ్యాయేమో అనే సందేహాలు మొదలయ్యాయి. గత ఏడాది స్వాతి కమ్ బ్యాక్ ప్రకటించారు. పంచతంత్ర టైటిల్ తో మూవీ చేశారు. ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో స్వాతి నటిస్తుంది.
2018లో స్వాతి ప్రేమ వివాహం చేసుకుంది. నిహారిక భర్త పేరు వికాస్ వాసు కాగా వృత్తిరీత్యా పైలట్. వివాహం అనంతరం స్వాతి విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఈ మధ్య ఇండియా వచ్చినట్లు సమాచారం. స్వాతి కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటున్నట్లు తెలుస్తుంది. నటిగా వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. స్వాతి కలర్స్ పేరుతో ప్రసారమైన షోతో పాపులర్ అయ్యింది. దర్శకుడు కృష్ణవంశీ డేంజర్ మూవీతో వెండితెరకు పరిచయం చేశాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్వాతి చిత్రాలు చేసింది.