Prabhas in Spirit : అర్జున్ రెడ్డి సినిమాతో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ..ఈయన ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేశాయి. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త కంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఆయన చాలావరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే విషయాన్ని సందీప్ రెడ్డి వంగ ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాడు. అయితే రెగ్యూలర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ల కాకుండా చాలా డిఫరెంట్ గా ఈ పాత్రను డిజైన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా డ్యూటీ చేస్తాడు.
తనకు ఎదురైన ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేసుకుంటూ శత్రువులను ఎలా అంతం చేస్తాడు. తద్వారా తను ఎలాంటి గుర్తింపు పొందుతాడు అనే విధంగా ఈ కథను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది చాలా బోల్డ్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక మరి ముఖ్యంగా చాలా వైలెంట్ గా ఈ సినిమాను చేసే ప్రయత్నంలో ఉన్నాడట. నిజానికైతే అనిమల్ సినిమా ఎలాగైతే ఉందో దానికి మించి ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి సందీప్ విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటే మాత్రం పాన్ ఇండియాలో ఆయనను మించిన డైరెక్టర్ మరొకరు ఉండరనెలా గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి…