Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారుసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఆయన అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు అక్క కొడుకు అయిన అశోక్ గల్లా హీరో అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది.
దాంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇక ‘దేవకి నందన వాసుదేవ’ అనే సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ బాబు కృష్ణుడి గెటప్ లో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలైతే జరుగుతున్నాయి.
మరి ఇది ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఈ న్యూస్ లో నిజం లేదు అంటూ నిన్న తన ట్విట్టర్ వేదికగా అశోక్ గల్లా స్పందించాడు. ఇక అతను వేరే సినిమా షూటింగ్స్ లో బిజి గా ఉండడంవల్ల తనకు ఆలస్యంగా ఈ విషయం తెలిసిందని అందువల్ల తను రెస్పాండ్ అవ్వక తప్పడం లేదంటూ ఆయన అందులో రాసుకొచ్చాడు. నిజానికైతే అయితే మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణుడి గెటప్ లో కనిపిస్తే మాత్రం సినిమా అద్భుతంగా ఉండేదని ఘట్టమనేని అభిమానులు అందరూ ఆశించారు. కానీ అశోక్ గల్లా ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పడంతో ఒకసారిగా మహేష్ బాబు అభిమానుల్లో నిరాశ అయితే ఎదురయింది. ఎందుకంటే మహేష్ బాబు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా సుధీర్ బాబు వచ్చాడు. మరి ఆయన అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు.
ఇక అశోక్ గల్లా మంచి విజయాన్ని సాధించి ఎదుగుతాడు అనుకుంటున్న సందర్భంలో మహేష్ బాబు అతనికి సపోర్ట్ చేసినప్పటికి ఆయన ఈ సినిమాలో ఒక పాత్ర చేసి ఉంటే బాగుండేదని ఘట్టమనేని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అశోక్ గల్లా సూపర్ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…