Chiranjeevi: స్వయం కృషితో పైకి ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు చిరంజీవి. మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ లా నిలిచిపోయింది చిత్ర పరిశ్రమలో. ఇలా ఎంతో పేరు సంపాదించి.. అభిమానుల మంచి చెడులు తెలుసుకుంటూ ప్రేక్షకుల మదిలో నిలిచాడు చిరు. చిత్ర పరిశ్రమలో ఆపద్భందవుడిలా నలిచిన ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. ఎంతో మంది తమకష్టాలను తెలియజేయడానికి మెగాస్టార్ వద్దకు వెళ్లడం ఆయన గొప్పతనం. అయితే మంచితనమే కాదు నటనలో ప్రావీణ్యం, ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే గుణం కలదు చిరంజీవి. అలా చిరంజీవి ఒక సినిమాను ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం..
చిరంజీవి అనే పేరు వినగానే మా ఇంటిమనిషి అన్నట్టు ఫీల్ అయ్యేవారు ఎంతో మంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలలో అగ్రశేణి నటుడు మెగాస్టార్ చిరంజీవి. విలన్ పాత్రలతో చిత్ర పరిశ్రమలో మొదలుపెట్టిన కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగి ఎన్నో హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు అదే తరహాలో ఫ్లాప్ లను రుచి చూశాడు చిరు. అయితే ఇదే తరహాలో ఒక సినిమా కేవలం 29 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకొని 500 రోజులు ఆడింది. 1982లో రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాలో హీరోగా చిరంజీవి, మాధవి హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. అయితే దర్శకుడికి, నటుడిగా వచ్చిన గొల్లపూడి మారుతికి ఈ సినిమా తొలి చిత్రమే. ఇక అదే సంవత్సరంలో ఏప్పిల్ 22న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పంటే కాదు 512 రోజులు ఆడి.. చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది ఈ సినిమా. దీంతో చిరు కెరీర్ ఈ చిత్రంతో ఒక మలుపు తిరిగిందని చెప్పాలి.
చిరంజీవి ఈ సినిమాలో భిన్నంగా కనిపించడమే కాదు 29 రోజుల్ల షూటింగ్ పూర్తయ్యేలా కష్టపడ్డాడు. దీనికి దర్శకుడి కష్టం ఎంతో ఉందనే చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదలైన మొదట్లో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత కలెక్షన్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అయితే కేవలం రూ. 3లక్షల 25 వేల రూపాయలతో ఈ సినిమా షూటింగ్ పాలకొల్లు, నరసాపురం, సఖినేటిపల్లి, పోడూరు, భీమవరం, మద్రాస్ లలో జరిపారు. అయితే సినిమా పనులు పూర్తయ్యాక సెన్సార్ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినా పట్టుదలతో రాఘవ కష్టపడి సెన్సార్ ఇబ్బుందులను కూడా గట్టేక్కేసాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు, 2 కేంద్రాలలో వంద రోజులు ఆడి సూపర్ డూపర్ కలెక్షన్లను సాధించి పెట్టింది.
ఇక మారుమూల ప్రాంతాలలోనే ఇలా ఆడితే హైదరాబాద్ సిటీలో అయితే ఈ సినిమా ఏకంగా 512వ రోజు వరకు ఆడింది. ఈ సినిమా కథ అంతా.. ఇంట్లో భార్యపై ప్రేమని చూపిస్తూనే.. ఇంటి బయట అడుగుపెట్టగానే మరో స్ర్తీ కోసం వెతుకులాడే మగాడి జీవితం చుట్టూ తిరుగుతుంది సినిమా. ఈ సినిమాతో చిరంజీవి యాక్షన్ హీరో గానే కాకుండా ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలను షూటింగ్ చేయాలన్నా ఎంత సమయం తీసుకుంటున్నారో తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే ఏకంగా ఏడాది,రెండేళ్ల సమయం షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ ఏది ఏమైనా కేవలం 29రోజులలో షూటింగ్ పూర్తి చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Chiranjeevis intlo ramayya veedilo krishnayya movie made in 29 days and run 500 days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com