Chiranjeevi Daughter Sreeja: మెగాస్టార్ చిరంజీవికి చిన్న కూతురు శ్రీజ అంటేనే ఇష్టమని అందరికి తెలుసు. కుటుంబంలో ఆమె చెప్పిందే వేదం. ఆమె సూచించిన మార్గంలోనే అందరు నడుస్తుంటారు. ఆమెకు కూడా కుటుంబంతో మంచి అనుబంధమే ఉంది. శ్రీజకు కల్యాణ్ దేవ్ తో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉండే శ్రీజ ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. చీటికి మాటికి తన కుటుంబంతో సెల్ఫీలు పెట్టే శ్రీజ కొద్ది రోజులుగా అభిమానులతో టచ్ లో ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఒంటరిగానే ఉండటంతోనే వారు సామాజిక మాధ్యమాల వైపు చూడటం లేదని తెలుస్తోంది. కానీ ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెరిగిందన్నదే అంతుచిక్కడం లేదు.

మొత్తానికి కల్యాణ్ కు శ్రీజకు ఏదో గొడవ మాత్రం జరిగిందని సమాచారం. అందుకే వారు సామాజిక మాధ్యమాల్లో కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా ఎవరికి వారే ఒంటరిగా పోస్టులు పెడుతూ కనిపిస్తున్నారు. దీంతో వారి మధ్య అగాధం చోటుచేసుకున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు. చిరునవ్వుతో కుటుంబంతో కలిసి ఉండే శ్రీజ కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ వారి మధ్య మాత్రం ఎడబాటు ఉందనే విషయం స్పష్టమవుతోంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముందు ‘3 ఆప్షన్లు’.. ఏపీలో అధికారం సాధ్యమేనా?
చిరంజీవి కూతురుగా శ్రీజకు అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఆమె కదలికలను గుర్తిస్తుంటారు. ఆమె హావభావాలను అంచనా వేస్తుంటారు. అందుకే శ్రీజ కల్యాణ్ మధ్య ఏదో జరిగి ఉంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఏమైనా త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి. వారు ఎందుకు దూరంగా ఉంటున్నారో? ఏం జరింగిందో అనే దానిపైనే అందరికి ఆసక్తి ఏర్పడింది. దీంతో వారి మధ్య ఉన్న దూరంపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలుగుతోంది.

మెగా కుటుంబం ఏ వేడుక చేసుకున్నా అందరు కలిసుండేవారు. కానీ ఈ మధ్య కల్యాణ్ దేవ్ మెగా కుటుంబంతో కలవడం లేదు. అంటే శ్రీజ, కల్యాణ్ కు ఏవో గొడవలు జరిగినట్లు సమాచారం. ఇటీవల శ్రీజ కూడా సోదరుడు చరణ్ తో కలిసి కొద్దిరోజులు ముంబై ఉండి వచ్చినా కల్యాణ్ ప్రస్తావన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీజ కల్యాణ్ మధ్య పొడచూపిన అపార్థాలకు కారణాలేంటనేది తెలియడం లేదు. వారి ఎడబాటు దేనికి సంకేతం అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి వారి మధ్య మళ్లీ సఖ్యత వచ్చి సరదాగా కలిసి ఉండాలనే ఆకాంక్ష అభిమానుల్లో వస్తోంది.
శ్రీజకు వంట రాదని కల్యాణ్ పలుమార్లు చెప్పడం తెలిసిందే. కానీ ఈ మధ్య శ్రీజ వంట గదిలో దర్శనం ఇస్తోంది. ఏదో ఒకటి వండుతూ నేనేం వండుతున్నానో చెప్పుకోండి అంటూ ప్రశ్నలు వేస్తూ సందడి చేస్తోంది. దీంతో ఆమెకు వంట రాకపోయినా ఏదో ఒకటి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే కల్యాణ్ ను మరిచిపోయేందుకు ఇలా చేస్తుందనే వాదనలు కూడా వస్తున్నాయి. కల్యాణ్ శ్రీజల మధ్య ఏం జరిగిందనేది త్వరలోనే తెలుస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Also Read:Anil Ravipudi Tamanna’s clash ఎఫ్3 టీంతో తమన్నాకు గొడవ.. బయటపెట్టిన అనిల్ రావిపూడి!
Recommended Videos:



[…] […]