Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ అయ్యారు. దశాబ్దాల పాటు చిరంజీవి ప్రస్థానం కొనసాగింది. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అనేక బ్లాక్ బస్టర్స్ అందించారు. 1990లలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవి. అమితాబ్ కంటే ఎక్కువ ఆయన ఛార్జ్ చేశారట. గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ రూ. 1.25 కోట్లు అని సమాచారం.
చిరంజీవికి ఉన్న మార్కెట్ రీత్యా నిర్మాతలు క్యూ కట్టేవారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు, అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధపడేవారు. సుదీర్ఘ ప్రస్థానంలో చిరంజీవి భారీగా ఆర్జించారు. ఆయనకు వివిధ నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి చెన్నైలో ఉండేవారు. అక్కడ ఆయనకు సొంత ఇల్లు కూడా ఉంది. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి కొన్ని ఆస్తులు అమ్మేశారని సమాచారం.
రామ్ చరణ్ కూడా స్టార్ అయ్యాక మెగా ఫ్యామిలీ సంపద, ఆస్తులు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో చిరంజీవికి అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. దీన్ని ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిలియాని కి చెందిన ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ రూపొందించింది. అప్పట్లోనే ఈ ఇంటి నిర్మాణానికి చిరంజీవి రూ. 30 కోట్లు ఖర్చు చేశారట.
అలాగే చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫార్మ్ హౌస్ ఉంది. మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల కోసం కొన్నిసార్లు బెంగుళూరు ఫార్మ్ హౌస్ కి వెళుతుంటారు. వైజాగ్ లో కూడా మెగా ఫ్యామిలీకి ప్రాపర్టీస్ ఉన్నాయి. హాలిడేస్ అప్పుడు అక్కడకు వెళతారు. తాజాగా చిరంజీవి ఊటీలో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారట. దీని విలువ రూ. 16.5 కోట్లు అని సమాచారం. అక్కడ ఒక లగ్జరీ ఫార్మ్ హౌస్ నిర్మించాలి అనేది చిరంజీవి ఆలోచన అట.
రామ్ చరణ్, ఉపాసన సైతం ఆ ప్రాపర్టీని సందర్శించారట. వాళ్లకు కూడా బాగా నచ్చిందట. ఊటీ అందమైన హిల్ స్టేషన్. అక్కడ ప్రముఖులు ఎస్టేట్స్, ఫార్మ్ హౌస్లు నిర్మించుకుంటారు. పలువురు సినిమా తరాలకు ఊటీలో ఫార్మ్ హౌస్లు, ప్రాపర్టీస్ ఉన్నాయి. చిరంజీవి కూడా తాజాగా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది.
Web Title: Chiranjeevi who bought a property in ooty will be shocked to know how many crores
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com