Chiranjeevi- K. Viswanath: టాలీవుడ్ దిగ్గజ దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాసని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..సుమారు 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు, ఆల్ టైం క్లాసిక్స్ ఎన్నో అందించి జాతీయ స్థాయిలో మన సినిమా ఖ్యాతిని తీసుకెళ్లారు..ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఒక లైబ్రరీ గా పెట్టుకొని కొత్తగా వచ్చే నూతన దర్శకులకు శిక్షణ ఇవ్వొచ్చు.

అంట అద్భుతంగా ఆయన సినిమాలు ఉంటాయి..చిరంజీవి , కమల్ హాసన్ , వెంకటేష్ వంటి అగ్ర నటులను విశ్వనాథ్ డైరెక్ట్ చెయ్యగా,పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ తో తప్ప దాదాపుగా అందరి హీరోలతో కలిసి ఆయన నటించాడు..అందరితో ఆయనకీ ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది..బ్రతికి ఉన్నన్ని రోజులు ప్రతీ ఒక్కరు విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లి ఆయనతో సరదాగా కాసేపు గడిపిరావడం వంటివి జరుగుతూ ఉండేవి.
ముఖ్యంగా చిరంజీవి మరియు కమల్ హాసన్ తో విశ్వనాథ్ గారికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం..వాళ్లిద్దరూ ఈయనని సొంత తండ్రిలాగానే భావించే వారు..నేడు అలాంటి మనిషిని ఇక మనం చూడలేమా అనే ఊహ కూడా వాళ్లకి ఎంత కష్టతరం గా ఉంటుందో ఊహించుకోవచ్చు..బరువెక్కిన హృదయాలతో వాళ్లిద్దరూ సోషల్ మీడియా లో పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..చిరంజీవి తో పాటుగా నందమూరి బాలకృష్ణ , వెంకటేష్ మరియు నాగార్జున కూడా సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు..ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు కూడా.

నేటి తరం హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి వాళ్ళు కూడా విశ్వనాథ్ గారికి నివాళులు అర్పించారు..వీరితో పాటుగా ఈమధ్యనే ఇండస్ట్రీ కి వచ్చిన హీరోలు మరియు హీరోయిన్లు కూడా విశ్వనాథ్ గారిని తల్చుకుంటూ బోరుమని విలపిస్తున్నారు..ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.