Walter Veeraiah- Veera Simha Reddy: గత జెనరేషన్ లో టాప్ 2 హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే ప్రతి ఒక్కరిలో అమితాసక్తి నెలకొనడం సర్వసాధారణమైన విషయం..చాలా సార్లు వీళ్లిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి..ఒకసారి మెగాస్టార్ చిరంజీవి పై చెయ్యి సాధిస్తే, మరోసారి బాలయ్య బాబు పై చెయ్యి సాధించేవాడు..అలా ఈ ఇద్దరి హీరోల మధ్య క్లాష్ అంటే ఆడియన్స్ లో వచ్చే ఊపే వేరు.

వీళ్లిద్దరి సినిమాలు చివరిగా పోటీపడింది 2017 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మరియు బాలయ్య బాబు గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు పోటీ పడ్డాయి..ఈ రెండు సినిమాలలో ఖైదీ నెంబర్ 150 బాలయ్య సినిమా మీద రెండింతలు ఎక్కువ వసూళ్లను రాబట్టింది..అప్పటి నుండి చిరంజీవి కి బాలయ్య బాబు అసలు పోటీనే కాదు..చిరంజీవి సినిమాకి ఉన్న మార్కెట్ లో పావు శాతం కూడా బాలయ్య బాబు కి ఉండదు అని ట్రేడ్ పండితులు తేల్చేసారు.
కానీ అనూహ్యంగా బాలయ్య బాబు అఖండ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచేసాడు..అఖండ తర్వాత విడుదలైన చిరంజీవి రెండు సినిమాలు అఖండ కలెక్షన్స్ ని అందుకోలేకపోయాయి..ఒక సినిమాకి డిజాస్టర్ టాక్ రాగా..మరో సినిమా రీమేక్ అవ్వడం తో ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయాయి..అలా రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా చిరంజీవి మీద పై చెయ్యి సాధించాడు బాలయ్య.

కానీ చిరంజీవి బాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు కూడా బాలయ్య బాబు తన పీక్ ఫేస్ లో కూడా చిరంజీవి మార్కెట్ కి ఆమడదూరం లో ఉన్నాడు అని నిరూపిస్తున్నాయి వీళ్లిద్దరి లేటెస్ట్ చిత్రాలు..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలయ్య బాబు వీర సింహా రెడ్డి చిత్రాలు వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్నాయి..ఈ రెండు సినిమాల బిజినెస్ మధ్య ఎంత తేడా ఉందొ మీరే చూడండి.
ప్రాంతం: వాల్తేరు వీరయ్య : వీరసింహారెడ్డి:
సీడెడ్ 15 కోట్లు 13 కోట్లు
ఉత్తరాంధ్ర 11 కోట్లు 07 కోట్లు
నెల్లూరు 3.5 కోట్లు 2.75 కోట్లు
అమెరికా 8 కోట్లు 3 కోట్లు
నైజాం 30 కోట్లు 18 కోట్లు
ఇంకా ఈ రెండు సినిమాలకు గుంటూరు,కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల బిజినెస్ ఓపెన్ లోనే ఉన్నాయి..ఇక్కడ కూడా వాల్తేరు వీరయ్య డామినేషన్ ఎక్కువ..మరో విశేషం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..వాల్తేరు వీరయ్య కి టాక్ వస్తే కేవలం వారం రోజుల లోపే వంద కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య కి 110 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ జరుగుతుండగా..వీరసింహ రెడ్డి కి 80 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.