Chiranjeevi vs Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కి మార్కెట్ లో మాములు క్రేజ్ లేదు..ఎందుకంటే రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్నా అవుట్ & అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం..ఇక ఇటీవలే విడుదల చేసిన ‘బాస్ పార్టీ’ సాంగ్ కి కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..ఎక్కడ చూసిన ఈ పాటనే మారుమోగిపోతుంది..దాంతో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అన్నీ ప్రాంతాలకు రికార్డు రేట్స్ కి కొనడానికి బయ్యర్స్ ముందుకి వస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు..ఆ పాత్ర నిడివి ఈ సినిమాలో సుమారుగా 45 నిమిషాల వరుకు ఉంటుంది..ఇందులో రవితేజ చిరంజీవి కి సవతి తమ్ముడిగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు..ఇక చిరంజీవి వైజాగ్ పోర్టుని ఆధారంగా చేసుకొని సెటిల్మెంట్స్ వంటివి చేసే మాస్ రౌడీ పాత్రలో నటిస్తున్నాడు.
సినిమాలో వీళ్లిద్దరి మధ్య క్లాషెస్ ఉంటాయి..ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం లో చిరంజీవి మరియు రవితేజ మధ్య వచ్చే ఫైట్ సీన్..మరియు ఒకరిపై ఒకరు వేసుకునే కౌంటర్లు హైలైట్ గా నిలవబోతుందట..మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఈ ఇంటర్వెల్ బ్లాక్ ది బెస్ట్ గా ఉండబోతుందని..ఫాన్స్ కి థియేటర్స్ లో పూనకాలు రావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట..ఇక డిసెంబర్ మొదటివారం లో మాస్ మహారాజా రవితేజ కి సంబంధించిన ఇంట్రడక్షన్ టీజర్ ని విడుదల చేయబోతున్నారట.

ఇక ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య వచ్చే సాంగ్ , టైటిల్ సాంగ్ మరియు మిగిలిన సాంగ్స్ తో పాటు రవితేజ – చిరంజీవి కాంబో టీజర్ కూడా త్వరలో విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం..డిసెంబర్ ప్రథమార్థం మొత్తం మెగా ఫాన్స్ కి పండగలాగా ఉండబోతుంది..ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..జనవరి 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.