Chiranjeevi Vs Ballaya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ హీరో అనే పడడానికి సరికొత్త నిర్వచనం తెలిపిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ..ఈ ఇద్దరి హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం ఉంటుంది అని చెప్పొచ్చు..ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒక్కే రోజు విడుదలైన సందర్భాలు చాలానే ఉన్నాయి..ఈ పోటీ లో ఒకసారి చిరంజీవి గెలిస్తే.మరోసారి బాలయ్య బాబు గెలిచాడు..ఉదాహరణకి తీసుకుంటే అప్పట్లో చిరంజీవి హీరో గా నటించిన మృగ రాజు సినిమా..అలాగే బాలయ్య బాబు హీరో గా నటించిన నరసింహ నాయుడు సినిమా రెండు ఒకేరోజు విడుదల అయ్యాయి..ఈ రెండు సినిమాలలో మృగరాజు సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిస్తే..నరసింహ నాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..మృగరాజు సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఓపెనింగ్స్ దుమ్ము లేపేసింది..కానీ ఫుల్ రన్ లో మాత్రం నరసింహ నాయుడు భారీ మార్జిన్ తో మృగరాజు సినిమా పై విజయం సాధించింది..ఇక నాలుగేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150 మరియు బాలయ్య బాబు 100 వ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు రెండు రోజుల గ్యాప్ తో విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టింది..కానీ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కనీసం 50 కోట్లు కూడా వసూలు చెయ్యలేదు..అలా ఈ పోటీలో చిరంజీవి భారీ మార్జిన్ తో బాలయ్య బాబు మీద విజయం సాధించాడు..అలా వీళ్ళ మధ్య పోటీ చాలా సార్లు జరిగింది.

Also Read: Ram Gopal Varma Konda Movie: కొండా మురళి-సురేఖ చరిత్ర ఇదీ.. ఆర్జీవీ తన సినిమాలో ఏం చూపిస్తాడు?
ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ తప్పే అవకాశం కనిపించడం లేదు..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నయనతార హీరోయిన్ గా ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..మెగాస్టార్ చిరంజీవి కి తగట్టు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని ఈ సినిమాని తెరకెక్కించాడట ఆ చిత్ర దర్శకుడు మోహన్ రాజా..ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..మరోపక్క బాలయ్య బాబు మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కూడా అక్టోబర్ 5 వ తారీఖున విడుదల చెయ్యడానికి ఆ చిత్ర బృందం సన్నాహాలు చేస్తునట్టు సమాచారం..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇలా ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవ్వబోతున్నాయి అంటూ సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది..ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా గాడ్ ఫాదర్ కాగా..అఖండ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ..ఈ రెండు సినిమాలు పోటీ పడితే ఎవరు గెలుస్తారు అనే పందాలు ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఇప్పటి నుండే ప్రారంభం అయ్యాయి.

Also Read: Union Minister Shobha Karandlaje: ఏపీ ఆదాయం విదేశాలకు తరలిపోతోందా? అసలేంటి కథ?
Recommended Videos:
[…] Also Read: Chiranjeevi Vs Ballaya: దసరా కి చిరు vs బాలయ్య.. ఎవరు గె… […]
[…] Also Read: Chiranjeevi Vs Ballaya: దసరా కి చిరు vs బాలయ్య.. ఎవరు గె… […]