Site icon OkTelugu

Chiranjeevi Vs Balakrishna Vs Nagarjuna: చిరంజీవి vs బాలయ్య vs నాగార్జున… వీళ్లలో విజయం సాధించేది ఎవరు…

Chiranjeevi Vs Balakrishna Vs Nagarjuna

Chiranjeevi Vs Balakrishna Vs Nagarjuna

Chiranjeevi Vs Balakrishna Vs Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వాళ్లలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళు వరుసగా సినిమాలను చేస్తు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ మొదటి నుంచి కూడా చిరంజీవి కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. ఇప్పటికీ ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఉంటుంది. దానివల్ల చిరంజీవి ప్రేక్షకులకు మెప్పిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయన మన శంకర్ వరప్రసాద్ సినిమాలో సైతం తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూసిన ఫీల్ కలిగింది. కాబట్టి మొత్తానికైతే చిరంజీవి 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ప్రేక్షకులను అలరిస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పుడు వరుసగా విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

ఇక నాగార్జున సైతం పెను ప్రభంజనాన్ని సృష్టించే విధంగా తన వందో సినిమాను చేస్తున్నాడు. యువ సామ్రాట్ గా పేరు సంపాదించుకున్న ఆయన వరుస సినిమాలను చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ముగ్గురు హీరోలు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా ఈ ముగ్గురు హీరోలు ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో వస్తున్న సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య గోపి చంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతుంది. ఇక నాగార్జున సైతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరు సక్సెస్ లను సాధిస్తారు ఎవరు ఢీలా పడిపోతారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు సత్తా చాటితే మాత్రం వాళ్ళ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. లేకపోతే మాత్రం వాళ్ల అభిమానుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో వీళ్ళందరు ఉండడం విశేషం…

Exit mobile version