Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర'(Vishwambhara Movie) గురించి మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు కానీ, బయట మెగా ఫ్యాన్స్ కి అసలు ఈ సినిమా ఉంది అనే విషయం కూడా తెలియదు, అలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్. షూటింగ్ కార్యక్రమాలు 2024 లోనే పూర్తి అయ్యింది. ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని 2025 , సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలి. కానీ అంతకు ముందు విడుదల చేసిన టీజర్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి డిజాస్టర్ రెస్పాన్స్ రావడంతో, గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చి, మరోసారి రీ వర్క్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది.
VFX షాట్స్ కూడా దాదాపుగా అన్నీ డెలివరీ అయిపోయాయి అట. కుదిరితే ఈ దసరా కి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారు. కానీ ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోవడం లేదట. అందుకు ముఖ్య కారణం సినిమా బాగా ఆలస్యం అవ్వడం వల్ల, ఫ్యాన్స్ లో , ఆడియన్స్ లో ఈ చిత్రం పై అంచనాలు పూర్తిగా తగ్గిపోవడం వల్లే అని తెలుస్తోంది. ఈమధ్య కాలం లో బజ్ లేని సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఓటీటీ డీల్ కుదరకపోతే, ఈ చిత్రం ఈ ఏడాది విడుదల అవ్వడం కూడా కష్టమే అని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. త్వరలోనే విడుదల తేదీ విషయం లో మేకర్స్ ఒక క్లారిటీ కి రాబోతున్నారట.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఒక పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సినిమాలోని పాటలన్నీ కీరవాణి నే కంపోజ్ చేశాడు , ఒక్క ఐటెం సాంగ్ మినహా, దీన్ని భీమ్స్ చేత కంపోజ్ చేయించారు. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా ఇప్పుడు కీరవాణి అందించడం లేదట. ఆయన ఈ సినిమా నుండి పూర్తిగా తప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం ‘వారణాసి’ చిత్రానికి ఆయన సంగీతం అందించడం లో బిజీ గా ఉండడం వల్లే. ఇప్పుడు కీరవాణి స్థానంలోకి గౌర హరి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన హనుమాన్ , మిరాయ్ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ‘విశ్వంభర’ కి అందించబోతున్నాడు.