‘అర్జున్ రెడ్డి’ మూవీ దర్శకుడు సందీప్ వంగా మొదలెట్టిన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ హుషారుగా కొనసాగుతోంది. సందీప్ వంగా తొలుత ఈ ఛాలెంజ్ ను దర్శకదిగ్గజం రాజమౌళికి ఈ సవాల్ విసిరారు. ఆయన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్లో భాగంగా ఇంటి పనులను చకచక పూర్తిచేసి ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, దర్శకుడు సుకుమార్, కొరటాల శివలను నామినేట్ చేశాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఛాలెంజ్ స్వీకరించి ఇంటి పనులు చేసిన వీడియోను ట్వీటర్లో పోస్టు చేసి టాలీవుడ్ అగ్రనటులను నామినేట్ చేశాడు. వీరిలో ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లు ఉన్నారు.
కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?
ఎన్టీఆర్ ఛాలెంజ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ లు పూర్తి చేసి వీడియోలను ట్వీటర్లో పోస్టు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్ని ఇంటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత దోశవేసి తన అమ్మకు దగ్గరుండి సర్వ్ చేశారు. అయితే ఆమె తొలుత తన కుమారుడి దోశను తినిపించి ఆ తర్వాత ఆనందాన్ని తిన్నారు. ఈ వీడియోను పోస్టు చిరు పోస్టు చేస్తూ ‘నేను రోజు చేసే పనులే.. ఈరోజు మీకోసం..’ ఈ వీడియోను సాక్ష్యం అంటూ ట్వీట్ చేశాడు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ దర్శకుడు మణిరత్నంలకు ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ విసిరారు.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020
అదేవిధంగా విక్టరి వెంకటేశ్ కూడా ఎన్టీఆర్ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. చిరంజీవి దోశ వేస్తే.. వెంకటేష్ కలర్ ఫుల్ కాయగాయలతో అద్భుతమైన కర్రీ చేశారు. ఇల్లు క్లీనింగ్ చేసి, గార్డెనింగ్ పనులు చేశారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి చకచక క్యారట్ ముక్కలు కట్ చేసి.. అందులో పన్నీర్ వేసి నోరూరించే విజిటేబుల్ కర్రీని వెంకీమామ తయారు చేసి వీడియోను పోస్టు చేశారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ పూర్తయిందన్న వెంకీమామ ముగ్గురిని నామినేట్ చేశారు. హీరో వరుణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావుపూడిలకు ఛాలెంజ్ విసిరారు. ఇందులో అనిల్ రావుపూడి వెంటనే వెంకీమామ ఛాలెంజ్ యాక్సప్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో ‘బీ ద రియల్ మేన్’ ఛాలంజ్ హుషారుగా సాగుతోంది.
Here's my video @tarak9999.
Let's help our family with domestic work and #BetheREALMAN
I request our Chinnodu @UrsTrulyMahesh, my cobra @IAmVarunTej & @AnilRavipudi to pass it on. pic.twitter.com/ILeH3Cm0Xq
— Venkatesh Daggubati (@VenkyMama) April 23, 2020
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Chiranjeevi venkatesh takes the real man challenge
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com