
కరోనా ఆల్మోస్ట్ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. క్వారంటైన్ కు పంపేస్తోంది. సాధారణ ప్రజానీకం నుంచి ముఖ్యమంత్రుల దాకా ఎవ్వరినీ వదలట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు నిలిపేశారు. ఇటు తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.
అయితే.. దీనికన్నా ముందుగానే ‘ఆచార్య’కు ప్యాకప్ చెప్పేశారు చిరు. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న సోనూ సూద్ కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా రెండు రోజులు షూట్ కంటిన్యూ చేసిన యూనిట్.. అర్ధంతరంగా ప్యాకప్ చెప్పేసినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ నిర్ణయంతోనే షూటింగ్ రద్దు చేసినట్టు సమాచారం.
కరోనా తొలి విడత లో మొదట షూటింగ్ ఆపేసింది చిరంజీవే. ఇప్పుడు కూడా ఆయనే ముందస్తుగా ప్యాకప్ చెప్పేసినట్టు సమాచారం. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వక ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు చిరు. అయితే.. మిగిలిన సినిమాలు మాత్రం షూట్ కంటిన్యూ చేస్తున్నాయి.
కీలకమైన షెడ్యూల్స్ మధ్యలో ఉన్న చిత్రాలు.. కొద్దిపాటి షూట్ తో సినిమా కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉన్న యూనిట్లు వేగంగా షూటింగ్ నడిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం ప్రకటించేలోపు.. అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని రాత్రి, పగలు రెండు షిఫ్టుల్లో చిత్రీకరణ జరుపుతున్నాయి.