Chiranjeevi And Srikanth Odela: గత రెండు మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీ లో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే , అసలు ఇండస్ట్రీ లో ఏమి అవుతుంది? అనే సందేహం రాక తప్పదు. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని ప్రాజెక్ట్స్ లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఆగస్టు 21 న ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఈ చిత్రం సెప్టెంబర్ లో వస్తుందా?, డిసెంబర్ లో వస్తుందా?, అసలు ఈ ఏడాది లో విడుదల అవుతుందా? అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అయ్యింది.
ఇలాంటి క్రమం లో డైరెక్టర్ సుజిత్ ‘బ్లడీ రోమియో’ నుండి పక్కకు జరిగి ‘ఓజీ 2’ కి తన ఫోకస్ ని షిఫ్ట్ చేయడం , అసలు ‘బ్లడీ రోమియో’ ఉంటుందా లేదా అనే సందేహాలకు దారి తీసింది. ‘ది ప్యారడైజ్’ ఆలస్యం అవుతూ ఉండడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుండి కాల్ రావడంతో సుజిత్ ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే భవిష్యత్తులో నాని నిర్మాతగా , మెగాస్టార్ చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కబోయే యాక్షన్ సినిమా కూడా అట్టకెక్కిందని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ ని శ్రీకాంత్ ఓదెల డీల్ చేస్తున్న విధానం నాని కి నచ్చలేదని , అందుకే ఈ మూవీ ని రద్దు చేసాడని , రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి.
వీటి అన్నిటికి సమాధానం నాని మాత్రమే చెప్పాలి. ‘బ్లడీ రోమియో’ చిత్రం అయితే ఇప్పట్లో లేనట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుజిత్, ఈ నెలాఖరున ఇండియా కి తిరిగి వస్తున్నదని , ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ 2’ చర్చల్లో పాల్గొంటాడని అంటున్నారు. ఈ ఏడాది నవంబర్ నుండే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. మరి నాని ‘బ్లడీ రోమియో’ సంగతి , చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ గురించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు రాబోతున్నాయో చూడాలి.
