Chiranjeevi- Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన సినిమా గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపూర్ లో నిర్వహించారు. సినిమాకు సంబంధించిన విశేషాలను చిరంజీవి చెబుతూ గాడ్ ఫాదర్ సినిమా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

‘చిన్నవాడైనా జాతీయ అవార్డు అందుకున్నాడు. పవన్ అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. పవనే ఓ శక్తి.’ అంటూ పవన్ కళ్యాణ్ చిరంజీవి సంచలన కామెంట్స్ చేశాడు. జాతీయ అవార్డు అందుకోవడం పవన్ కళ్యాణ్ గొప్పతనంగా అభివర్ణించారు.
విజయదశమి రోజు విడుదలయ్యే గాడ్ ఫాదర్ ను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం. నాగార్జున నటించి ది ఘోస్ట్ ను కూడా విజయవంతం చేయాలని కోరారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నారు. విజయదశమికి వచ్చిన తన చిత్రాలన్ని విజయవంతమయ్యాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ కూడా తప్పకుండా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని చెప్పడం గమనార్హం.

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఎందుకు ఏర్పాటు చేశారనే దానిపై కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం అనంతపూర్ లో నిర్వహించారనే టాక్ వస్తోంది. జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని చిరు భావిస్తున్నట్లు ఇదివరకే వార్తలు రావడంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ పై కూడా రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి వెనక నుంచైనా మద్దతు ఇచ్చేందుకు చిరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తన అభిమానులను జనసేనకు ఓటు వేయాలని చెప్పడానికే అనంతపూర్ ను ఎంచుకున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read:Prince George : మా నాన్న రాజవుతాడు, అప్పుడు చెబుతా నీ పని : రాకుమారుడికి అప్పుడే తలకెక్కింది!
[…] […]