Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికీ, ఆయన వ్యక్తిత్వం పరంగా ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్క అభిమానికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఇక ఆయనతో సినిమాలు చేయడానికి, దర్శకులు పోటీ పడుతూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే లైనప్ మాత్రం చాలా పెద్దగా ఉందనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక సినిమాని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత అదే స్టోరీ తో చిరంజీవి సినిమా చేసి సక్సెస్ ని అందుకున్నాడు. ఇంతకీ అది ఏ సినిమా అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్టాలిన్ సినిమా. ఈ స్టోరీని ముందుగా మురుగదాస్ పవన్ కళ్యాణ్ కి వినిపించాడు. ఆ స్టోరీ తనకి సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఆ కథని రిజెక్ట్ చేశాడు.
ఇక అదే కథని చిరంజీవికి చెప్పి ఒప్పించి మురుగదాస్ స్టాలిన్ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. నిజానికి పవన్ కళ్యాణ్ కి అప్పుడున్న ఇమేజ్ కి ఆ కథ సరిపోయేది కాదు. కాబట్టి తను ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు.
కానీ చిరంజీవికి మాత్రం అలాంటి కథలు చాలా బాగా సెట్ అవుతాయి… కాబట్టి చిరంజీవి కథ వినగానే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తెలుగులో మురుగ దాస్ చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు…