Mega 158: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) , తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తో చేయబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో వింటేజ్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని పూర్తిగా బయటకు తీసుకొని వచ్చి ఉండొచ్చు. కానీ అంతకు ముందే ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవి కామెడీ టైమింగ్ ని బయటకు లాగాడు బాబీ, దానిని అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చాడంతే. ఇప్పుడు మెగాస్టార్ లోని వింటేజ్ మాస్ యాంగిల్ ని నేటి తరం ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు డైరెక్టర్ బాబీ.
ఈ చిత్రానికి ‘కాకాజీ’ లేదా ‘కాకా’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్స్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమాకు పెట్టుకొని దశాబ్దాలు అయ్యింది. ఆరోజుల్లో ‘ఖైదీ’, ‘వేట’, ‘జ్వాలా’ లాంటి టైటిల్స్ చిరంజీవి సినిమాలకు ఉండేవి. ఈ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్టింగ్ ని చూస్తే గూస్ బంప్స్ రాక తప్పదు. డైరెక్టర్ బాబీ అలాంటి మాస్ యాంగిల్ ని మరోసారి బయటకు తీసుకొని రాబోతున్నాడు అన్నమాట. ఆయన విజన్ కి తగ్గట్టు అలా మెగాస్టార్ ని చూపిస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మామూలు రేంజ్ లో ఉండవు. నేటి తరం స్టార్ హీరోలు కూడా ఆ రికార్డ్స్ ని అందుకోవడం కష్టమే అని చెప్పొచ్చు. రేపే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడం వల్ల కొన్ని రోజులకు వాయిదా వేసాయారు.
ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా కథకు సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నాడు డైరెక్టర్ బాబీ. తన టీం కూడా నాన్ స్టాప్ గా ఈ కథ పై పనిచేస్తోంది. ఈ చిత్రం లో మెగాస్టార్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. అదే విధంగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. సినిమా మొత్తం ఆయన పాత్ర కూడా ఉంటుంది. ఇక ఈ చిత్రం లో చిరంజీవి కూతురు గా కృతి శెట్టి నటించబోతుంది అట. ఆమెతో అగ్రిమెంట్ సంతకాలు కూడా జరిగిపోయాయి. హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని తీసుకునే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.