Megastar Chiranjeevi: సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు అగ్ర హీరో చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గాడ్ ఫాదర్’ సెట్స్‌పై ముస్తాబవుతోంది. వీటితో పాటు దర్శకులు మెహర్ రమేష్, బాబీ (కె.ఎస్.రవీంద్ర)లతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో ముందుగా బాబీ చిత్రమే పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. దీన్ని చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. శక్తిమంతమైన మాస్ మసాలా కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఆ మధ్య చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీలుక్‌తో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దీపావళి నుంచి మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. మాస్ మసాలా కథతో ఇది తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
అగ్ర హీరో చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గాడ్ ఫాదర్’ సెట్స్‌పై ముస్తాబవుతోంది. వీటితో పాటు దర్శకులు మెహర్ రమేశ్, బాబీ(కె.ఎస్.రవీంద్ర)లతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో ముందుగా బాబీ చిత్రమేప్రారంభం కానున్నట్లు తెలిసింది.
దీన్ని చిరు, దీపావళి సందర్భంగా నవంబరు 6న మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. శక్తిమంతమైన మాస్ మసాలా కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఆ మధ్య చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీలుక్‌తో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం ‘వాల్తేరు వాసు’తో పాటు పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.