Chiranjeevi: చంద్రబాబు రాజకీయం చేయగలడు.. రాజకీయాన్ని చూపించగలడు.. ఆయన గురించి తెలిసినవారు ఇలానే మాట్లాడుతారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సైతం అతీతులు కాదు. చంద్రబాబును నమ్మి నిండా మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు సైతం చంద్రబాబు విషయంలో కొన్ని వాస్తవాలను చిరంజీవి బయట పెట్టారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టిడిపి, జనసేన పొత్తు కుదిరిన వేళ.. సోషల్ మీడియాలో చిరంజీవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కేవలం 18 స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడికి కొద్దిరోజులకే పిఆర్పిని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేశారు. రాష్ట్రంలో రెండు మంత్రి స్థానాలను పొందారు. తాను రాజ్యసభ సభ్యుడు పదవి పొంది.. కేంద్ర మంత్రి అయ్యారు.అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014 ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసింది. అయితే సరిగ్గా ఆ ఎన్నికలకు ముందే చిరంజీవి చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.
పిఆర్పి కాంగ్రెస్ లో విలీనం కాకముందు.. చిరంజీవి ఆహ్వానం మేరకు చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు. క్రియాశీల రాజకీయాల విషయంలో సలహాలు సూచనలు కావాలని కోరారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఇతర పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. దానిని గుర్తు చేస్తూ చంద్రబాబుచిరంజీవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయని వాపోయారు.అయితే రాష్ట్ర విభజన సమయంలో అదే చంద్రబాబు ఇతర పార్టీల నేతలను తన పార్టీలోకి ఆహ్వానించారు. దానిని గుర్తు చేస్తూ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాడు చెప్పిన విషయాలను దెప్పి పొడిచారు. ఎన్నెన్నో మాటలు చెప్పారని.. కానీ చంద్రబాబు మాత్రం మాట మీద నిలబడలేకపోయారని చిరంజీవి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కావాల్సింది అధికారం మాత్రమేనని.. దానికోసం ఎంత దాకైనా తెగిస్తారని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు తీరును తప్పు పడుతున్నారు.
చంద్రబాబు గారిని సలహా కోసం ఇంటికి భోజనానికి పిలిస్తే….. మా ఎమ్మెల్యే లనే కొనాలి అని చూసాడు – చిరంజీవి pic.twitter.com/vmkFj5OiII
— Anitha Reddy (@Anithareddyatp) December 9, 2023