రాజకీయాల నుంచి సినిమాల్లోకి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఖైదీ-150, సైరా మూవీలతో మెగాస్టార్ మరోసారి ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. అయితే మెగా అభిమానులకు ఏమాత్రం చిరంజీవిలో వారికి కావాల్సిన అంశాలు మాత్రం పూర్తిస్థాయిలో దక్కలేదని వాస్తవం. మెగాస్టార్ నుంచి అభిమానులు ముఖ్యంగా ఆయన నుంచి డాన్స్, పైట్స్ కోరుకుంటారు. అయితే ఇటీవల ఆయన నుంచి వచ్చిన మూవీలు మాత్రం పూర్తిస్థాయిలో ఆ అంశాలను చూపించలేకపోయాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి-152 మూవీలో అభిమానులు కోరుకుంటున్న పాత మెగాస్టార్ ను దించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లకముందు చేసిన మూవీలు ఠాగూర్, స్టాలీన్, జై చిరంజీవి మూవీలను దర్శకుడు కొరటాల శివ చూసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మెగాస్టార్ అభిమానులను ఏవిధంగా ఆకట్టుకున్నాడో పరిశీలించి వాటన్నింటిని చిరంజీవి-152 మూవీలో చేర్చుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో చిరంజీవి అదిరిపోయే స్టెప్పులతో అలరించనున్నాడు. ఇప్పటికే చిరంజీవిపై మూడు ఫైట్స్, ఒక పాటను చిత్రకరించారు. ఇంకో నాలుగు సాంగ్స్ చిత్రీకరణలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను అలరించేలా ఫైట్స్ వంటివి అద్భుతంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి-రెజీనాలపై స్పెషల్ ఐటమ్ సాంగ్ చిత్రీకరించాడు. చిరంజీవి-రెజీనా డాన్స్ కు థియేటర్లో ఫ్యాన్స్ ఉగిపోవడం ఖాయమని తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో మెగాస్టార్ కు జోడీగా చెన్నై బ్యూటీ త్రిష నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘స్టాలీన్’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవికి సరైన జోడి అనిపించుకుంది. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. రాంచరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. మెగాస్టార్ మూవీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ను ఈ మూవీలో తెరకెక్కిస్తుండటంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.