Chiranjeevi in Sankranthi 2027 Race: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే వారసత్వం ఉండాలి అనే ఒక ధోరణికి స్వస్తి చెబుతూ స్వయంకృషి ఉంటే ఎవరైనా సరే ఇండస్ట్రీలో రాణించొచ్చు అని ప్రూవ్ చేసిన ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి…వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి తన డాన్సులతో, ఫైట్లతో ప్రేక్షకులందరిని మైమరిపింపజేశాడు. నిత్య కృషివలుడిగా పేరు తెచ్చుకొని ఒక సినిమా కోసం ఎంత ఎఫర్ట్స్ అయితే కావాలో అంత ఎఫెర్ట్స్ పెట్టి ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా మార్చడానికి తీవ్రమైన కృషి చేస్తుంటాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ప్రతి సినిమా అతనికి గొప్ప ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో సైతం మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాడు. వారం రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే రాబట్టలేదు.
వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్ల క్లబ్లో చేరిన ఆయన మన శంకర వరప్రసాద్ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 450 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు… చిరంజీవికి సంక్రాంతి పండుగ సీజన్ చాలా కలిసి వస్తుంది.
ఇంతకు ముందు వరకు చాలా సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు మరోసారి మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సంక్రాంతి హీరోగా నిలిచాడు. ఈ సంక్రాంతి ముగిసిందో లేదో నెక్స్ట్ సంక్రాంతికి సైతం తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి చిరంజీవి సిద్ధమవుతున్నాడు. 2027 వ సంవత్సరంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఫిబ్రవరి నెల నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ అయితే జరపబోతున్నారట.
మొత్తానికైతే 10 నెలల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా మరోసారి ఆ సినిమాని 2027 సంక్రాంతి బరిలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించింది…ఇక మరోసారి వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
