GodFather Censor Report: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన గాడ్ ఫాదర్ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 5 వ తారీఖున విజయదశమి ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది..ఆచార్య సినిమా తో ఘోరంగా నిరాశపడిన మెగా అభిమానులు ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ ఎలా అయినా కొట్టాలనే కసి మీద ఉన్నారు..టీజర్ మరియు విడుదల చేసిన పాట కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో మూవీ పై అంచనాలు భారీగానే పెరిగాయి..ఇటీవలే ఈ సినిమాలోని డైలాగ్ ని చిరంజీవి గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వాయిస్ నోట్ ని విడుదల చేసి ఈ మూవీ పై అంచనాలను భారీ గా పెంచేలా చేసాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది..సెన్సార్ సభ్యులు ఈ మూవీ కి U/A సర్టిఫికెట్ ఇచ్చింది..అయితే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరుకు మెగా అభిమానులను పూనకాలు రప్పించే విధంగా ఉంటుందట..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సన్నివేశానికి థియేటర్ లో అభిమానులు చొక్కాలు చింపుకోవడం ఖాయం అట.

ఆ రేంజ్ లో ఈ సినిమాలోని అన్ని సన్నివేశాలు వచ్చినట్టు సమాచారం..ఆచార్య సినిమా అభిమానులను ఎంతలా నిరాశపరిచిందో..గాడ్ ఫాదర్ సినిమా అంతలాగ సంతృప్తి పరుస్తుందని సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్..ఇక ఈ సినిమా కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారట..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వీకెండ్ లోనే చెయ్యబోతున్నట్టు సమాచారం..చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.