
టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ అభిమానులు ఉన్నది మెగా ఫ్యామిలీకే.. మెగా హీరోలంటే పడిచచ్చే వారు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ ప్రాణం ఇస్తారు. అభిమాన హీరో కోసం ఎంత రిస్క్ అయినా చేసే వారున్నారు. తాజాగా టాలీవుడ్ మెగా బ్రదర్స్ కోసం ఓ అభిమాని సాహసమే చేశాడు. ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి సైకిల్ పై వచ్చి అభిమాన హీరోలను కలిసి ఆనందపడ్డాడు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసేందుకు ఓ అభిమాని ఒకరు 12 రోజులు సైకిల్ యాత్ర చేపట్టాడు. సైకిల్ పై తిరుపతిలోని అలిపిరి నుంచి బయలు దేరి 12 రోజులకు హైదరాబాద్ కు చేరుకొని చిరంజీవిని కలిశాడు.
ఈ ఊహించని రీతిలో అభిమాని ఏకంగా సైకిల్‌పై అన్ని వందల కి.మీలు రావడంపై చిరంజీవి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన అభిమాని ఎన్. ఈశ్వరయ్య చేసిన పనికి చలించిపోయాడు. అతడితో మాట్లాడి ఫొటో దిగి.. ఈశ్వరయ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు.
అనంతరం తమ్ముడు పవన్ ను చూడాలని ఉందన్న అభిమాని కోరికను తీర్చాడుచిరంజీవి. పవన్ ను కలిసే ఏర్పాట్లు చేశాడు. పవన్ ను కూడా కలిసిన ఈశ్వర్యయ్య తనకు ఇది దక్కిన అదృష్టంగా పేర్కొన్నాడు. ఇద్దరు స్టార్ హీరోలను కలవడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఇద్దరినీ కలవడం 12 రోజుల పాటు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందనిపించిందన్నారు. తన జీవితకాల కోరిక తీరిందన్నాడు.
తిరుపతి జిల్లా బలుజుపల్లి గ్రామానికి చెందిన ఎన్. ఈశ్వరయ్య ఆగస్టు 10న సైకిల్యాత్రచేపట్టాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయనను కలవాలని తలించాడు. ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టిన ఈశ్వరయ్య చిరంజీవిని కలవడానికి వ్యయప్రయాసలు ఓర్చి ఇంత దూరం వచ్చాడు.
Diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols #Chiranjeevi And #PawanKalyan pic.twitter.com/qnRRf2YYKl
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) August 27, 2021