Site icon OkTelugu

Chiranjeevi Bobby Movie: చిరంజీవి బాబీకి పెట్టిన కండిషన్స్ ఇవే… తేడా జరిగితే అంతే…

Chiranjeevi Bobby Movie Item Song Removed

Chiranjeevi Bobby Movie Item Song Removed

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుంది. తొందరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ మీద చిరంజీవి చాలా వరకు అంచనాలైతే పెట్టుకున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. దాంతో బాబీని నమ్మి మరోసారి అతనికి అవకాశమైతే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో బాబీ చిరంజీవిని చాలా వైల్డ్ గా చూపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. 50 సంవత్సరాల వ్యక్తి తన కూతురికి ఎలా అండగా నిలిచాడు. తన కూతురికి వచ్చిన కష్టం ఏంటి అనే విషయాలను కూడా ఇందులో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది.

చిరంజీవి బాబీ కి కొన్ని కండిషన్స్ పెట్టారంట. ఈ సినిమా బడ్జెట్ ఓవర్ గా కాకూడదని అలాగే సినిమా స్క్రిప్ట్ విషయంలో నాకు ఏదైతే చెప్పావో దాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలని ఇక స్క్రిప్ట్ ని ఎప్పుడు కూడా మార్చాల్సిన అవసరం ఉండొద్దని చెప్పారట. తనకు ఏదైతే చెప్పాడో దాన్నే తీయాలని స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా చిరంజీవి బాబీ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.

బాబీ కూడా చిరంజీవి పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకొని సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు గొప్ప విజయాలను సాధించిన కూడా ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ లో రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు తప్ప మిగతా సినిమాకు ఆడలేదు.

ఇక ఈ ఇయర్ మన శంకర్ వరప్రసాద్ మూవీ సూపర్ సక్సెస్ అయిన కూడా అది సంక్రాంతి హిట్ అని చిరంజీవి రేంజ్ సినిమా కాదని చాలామంది దాన్ని విమర్శించారు. ఇక ఇప్పటికైనా చిరంజీవి రేంజ్ సినిమాతో వచ్చి మరోసారి తన సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version