Chiranjeevi cyber crime complaint: ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి సిటీ సివిల్ కోర్టు తన వ్యక్తిగత ఫోటోలకు భద్రతా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, దీనిపై కొంతమంది ఆకతాయిలు ట్విట్టర్ లో చిరంజీవి పై అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తూ పోస్టులు వేశారు. ఇలాంటి ట్విట్టర్ అకౌంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఈరోజు ఉదయం ఆయన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏమేరకు ఫిర్యాదు చేశారు. తన పై అసభ్యమైన పోస్టులు పెట్టిన ట్విట్టర్ అకౌంట్స్ ని ఆయన తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చిరంజీవి ఈ సందర్భంగా పోలీసులను కోరారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్ గా పిలవబడే దయా చౌదరి అనే వ్యక్తి తనపై తరచూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని, అతనిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరాడు. పోలీసులు కేసు ని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేవలం చిరంజీవి మీద మాత్రమే కాదు, సోషల్ మీడియా లో సెలబ్రిటీలందరూ ఇలాంటి నెగిటివిటీ ని ఎగురుకుంటూ ఉన్నారు. ప్రతీ హీరోకి అభిమానులు ఉన్నట్టుగానే, దురాభిమానులు కూడా ఉంటారు. చిరంజీవి కి అభిమానులు ఎక్కువే, దురాభిమానులు కూడా ఎక్కువే. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి మాస్ హీరోలకు కూడా ఇలాగే ఉంటుంది. అయితే వీళ్లంతా సోషల్ మీడియా ని పెద్దగా పట్టించుకోరు కానీ, చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియా ని బాగా అనుసరిస్తున్నట్టు ఉన్నాడు. ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి కొన్ని వెబ్ సైట్స్ లో చాలా ఆస్దభ్యంగా పెత్తదాయాన్ని చూసిన చిరంజీవికి చాలా కోపం వచ్చింది. సాదరంగా మెగాస్టార్ తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఇలాంటివి పట్టించుకున్న దాఖలాలు లేవు. తన పని తానూ చేసుకుంటూ వెళ్లిపోయే రకం.
అలాంటి మెగాస్టార్ కి కూడా కోపం రప్పించి, పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరీ ఫిర్యాదు ఇచ్చే రేంజ్ కి మ్యాటర్ వెళ్లిందంటే, ఆకతాయిలు ఏ రేంజ్ లో లిమిట్ దాటి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వం లో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతోంది. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తుండడం తో సంక్రాంతికి వార్ వన్ సైడ్ అనే విధంగా మారిపోయింది అంటూ విశ్లేషకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
Photo Moment: #Chiranjeevi meets Hyderabad Commissioner VC Sajjanar pic.twitter.com/QXmzGTaC3z
— MOHIT_R.C (@Mohit_RC_91) October 12, 2025