Chiranjeevi comedy in Anil Ravipudi film : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని అలరించడమే కాకుండా చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. ఇలాంటి నటుడు మంచి సినిమాలను చేస్తూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ప్రస్తుతం ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ప్రేక్షకులకు చెప్పడమే కాకుండా తన కామెడీతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. యాక్షన్ ఎంటర్టైనర్లను తీయడంలో ఆయనకు ఎవరు సాటిలేరనే చెప్పాలి. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాని సైతం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…ఇక చిరంజీవి ఆల్ రౌండర్ అనే విషయం మనకు తెలిసిందే. నవరసాలను పండిస్తూ ఆయన ఏదైనా సరే చేయగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కావడం వల్ల అతనితో ఈ సినిమాలో కామెడీ డోస్ ని పెంచి ప్రేక్షయ ముందు నిలపాలనే ప్రయత్నం చేస్తున్నారట.
Also Read : అప్పుడే పూర్తి అయ్యిందా..మెగాస్టార్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన అనిల్ రావిపూడి!
దానికోసం సపరేట్ గా ఒక కామెడీ ట్రాక్ ను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు. అందులో చిరంజీవి మీద కామెడీ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఆ రశేష్ చూసిన సినిమా యూనిట్ మొత్తం ఫుల్లుగా నవ్వుకుంటున్నారట.
ఇక చిరంజీవి ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని చూసే ప్రేక్షకులు సినిమా అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉంటారని ప్రతి సీన్లో ఏదో ఒక కామెడీ సీన్ ఇన్వాల్వ్ చేసి చిరంజీవి చేత అల్టిమేట్ కామెడీ ని చేయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక జనవరి 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు నిలపాలనే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నాడు.
ఇక దానికోసమే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నా చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…