Vishwambhara Teaser: ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం. మెగా ఫ్యాన్స్ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు ఆయన పుట్టినరోజు ప్రత్యేకంగా జరపనున్నారు. అదే సమయంలో మెగాస్టార్ తన అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ విశ్వంభర టీజర్ విడుదల చేస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి విశ్వంభర దర్శకుడు. విశ్వంభర మూవీ టీజర్ కట్ ఇప్పటికే ముగియగా… చూసిన వాళ్ళు వివరాలు లీక్ చేశారు. విశ్వంభర టీజర్ ఎలా ఉంటుంది? చిరంజీవిని ఎలా పరిచయం చేశారు? హైలెట్స్ ఏమిటి? అనే కీలక విషయాలు బయటకు వచ్చాయి.
విశ్వంభర టీజర్ చూసిన ప్రముఖులు విస్తుపోయారని సమాచారం. రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ రేంజ్ లో విశ్వంభర టీజర్ ఉందట. నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయట. విశ్వంభర చిత్రంలో చిరంజీవి కొన్ని లోకాల్లో సంచరిస్తారని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. టీజర్లో సదరు లోకాలను పరిచయం చేశారట. విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం కాగా చిరంజీవి లుక్ అద్భుతంగా ఉందని అంటున్నారు. యంగ్ అండ్ హ్యాండ్సమ్ గా చిరంజీవిని విశ్వంభర టీజర్లో చూపించారట.
మరొక విశేషం ఏమిటంటే.. విశ్వంభర మూవీ కాన్సెప్ట్ సైతం తెలియజేసేలా టీజర్ ఉందని సమాచారం. అంటే ఈ చిత్రంలో దర్శకుడు వశిష్ట ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ప్రేక్షకులకు అవగాహన కలిగేలా టీజర్ కట్ ఉందట. ఒక హాలీవుడ్ మూవీని చూడబోతున్నాం అనే భావన కలిగించేలా టీజర్ డిజైన్ చేశారట. ఇక ఆస్కార్ విన్నర్ కీరవాణి అందించిన బీజీఎం మరొక హైలెట్ అంటున్నారు. మొత్తంగా టీజర్ తోనే అంచనాలు ఆకాశానికి చేరడం ఖాయమని సమాచారం.
చాలా కాలం అనంతరం చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నాడు. 2004లో వచ్చిన అంజి అనంతరం ఆయన సోషియో ఫాంటసీ సబ్జెక్టు ట్రై చేయలేదు. చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి సోషియో ఫాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి అయితే ఇండస్ట్రీ హిట్. అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన చిత్రం అది. అదే టైటిల్ విశ్వంభర చిత్రానికి అనుకున్నారు. కానీ నిర్మాత అశ్వినీ దత్ అంగీకరించలేదు.
మరొక విశేషం ఏమిటంటే… చాలా కాలం అనంతరం త్రిష-చిరంజీవి జతకడుతున్నారు. 2006లో విడుదలైన స్టాలిన్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు. త్రిష పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందట. మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, సురభి, ఈషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్స్ సైతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.
చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ నిరాశపరిచింది. తమిళ చిత్రం వేదాళం రీమేక్ గా ఆ చిత్రం తెరకెక్కింది. భోళా శంకర్ ఫలితం నేపథ్యంలో ముందుగా అనుకున్న ఓ రీమేక్ పక్కన పెట్టి చిరంజీవి దర్శకుడు వశిష్టకు ఛాన్స్ ఇచ్చాడు. విశ్వంభర విజయం సాధిస్తే వశిష్ట స్టార్ దర్శకుల లిస్ట్ లో చేరతాడు అనడంలో సందేహం లేదు.
Web Title: Chiranjeevi birthday special vishwambhara teaser key details leaked
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com