Homeఎంటర్టైన్మెంట్Ram Mandir: అయోధ్యకు చిరంజీవి, రామ్ చరణ్.. ఆహ్వానంపై చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

Ram Mandir: అయోధ్యకు చిరంజీవి, రామ్ చరణ్.. ఆహ్వానంపై చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

Ram Mandir: అయోధ్య రామ భక్తులతో నిండిపోయింది. దేశం నలుమూల నుండి లక్షల మంది అయోధ్య చేరుకున్నారు. నేడు రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. చిత్ర ప్రముఖులు కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. టాలీవుడ్ నుండి చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లకు ఆహ్వానం లభించింది.

ఈ క్రమంలో చిరంజీవి కుటుంబంతో పాటు అయోధ్య రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్, సురేఖలకు ఘన స్వాగతం లభించింది. అయోధ్య ఎయిర్ పోర్ట్ లో ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. శాలువాలు కప్పి గౌరవించారు. అనంతరం చిరంజీవి జాతీయ మీడియాతో మాట్లాడారు.

అయోధ్య రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం దేవుడిచ్చిన వరం అని చిరంజీవి అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల నాటి కల. అది సాకారం కావడం అద్భుత పరిణామం. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి. ఆయనే స్వయంగా నన్ను ఆహ్వానించిన భావన కలుగుతుందని, చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరంజీవి, రామ్ చరణ్ లతో కూడిన వీడియో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సైతం అయోధ్యలోనే ఉన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రన్బీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, రాజ్ కుమార్ హిరానీ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular