Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడి హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి మృతి చెందారు. ఆయనకు అధికంగా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. శివ శంకర్ మాస్టర్ హాస్పిటల్ లో ఉన్న సమయంలో సోనుసూద్, మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, విష్ణు వంటి పలువురు హీరోలు ఆయన కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేశారు. అయితే మీరు చేసిన సహాయం ఫలించలేదని చెప్పాలి.
Also Read: సాయం చేయలేని సానుభూతి వల్ల ఉపయోగం ఏముంది ?
చికిత్స తీసుకుంటూ శివ శంకర్ మాస్టర్ మృతి చెందారన్న వార్త తెలియడంతో ఆయన మృతిపై మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి మృతి చెందారు అనే వార్త మనసును ఎంతగానో కలిచివేసింది. తాను నటించిన ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన అసిస్టెంట్ గా వెనకుండి ఆ పాటలను కంపోజ్ చేసింది మాత్రం శివ శంకర్ మాస్టర్. అప్పటి నుంచి మొదలై మగధీర వరకు ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రాఫర్ గాచేశారు. మగధీర సినిమాలోని ఆయన కొరియోగ్రఫీ చేసిన ధీర ధీర అనే పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. తాజాగా అతనిని ఆచార్య సెట్లో కలిశాను కానీ అదే చివరి కలయిక అవుతుందని ఊహించలేదని చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
అదేవిధంగా శివ శంకర్ మాస్టర్ మృతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రముఖ సినీ నృత్య దర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ ఉండగా ఆయన కోలుకొని బయటకు వస్తారని భావించాము కానీ ఇలా జరగడం ఎంతో బాధాకరం. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.