Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తున్నా వాళ్ళలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. మూస ధోరణిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీని తన ఫైట్లతో, డాన్సులతో కొత్తదనం అద్ది ప్రేక్షకులందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టుగానే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు సినిమాలను అనవసరంగా చేశాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆయన రెండు సినిమాలు చేయకపోయిన బాగుండేది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. అందులో మొదటిది ఆచార్య కాగా, రెండోది గాడ్ ఫాదర్ కావడం విశేషం…ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఈ సినిమాలు విజయాన్ని సాధించకపోవడమే కాకుండా చిరంజీవికి భారీగా బ్యాడ్ నేమ్ ను తీసుకువచ్చాయి. మొత్తానికైతే చిరంజీవి సినిమాలను ఎందుకు చేశాడు అంటూ తన అభిమానులు సైతం బాధపడ్డారు. ఇక ఇదిలా ఉంటే మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశాడు.
అయితే ఈ సినిమాని మొదట మాలయాళంలో మోహన్ లాల్ లూసిఫర్ అనే పేరుతో తీశాడు. ఇక అదే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఈ సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం ఇప్పించలేకపోయాడు. తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో సక్సెస్ ని సాధించాడు. సైరా సినిమా ఆవరేజ్ గా నిలిచినప్పటికి అది ఒక డిఫరెంట్ అటెంట్ మిగిలిపోయింది.
కానీ ఆచార్య, గాడ్ ఫాదర్ రెండు సినిమాల విషయంలోనే చిరంజీవి సైతం పూర్తిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు అంటూ తన సన్నిహితులు సైతం చెబుతుండడం విశేషం…ఈ సినిమాలు చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడట. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు…