Child Actress: ఈ క్రమంలో ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టుగా తమ కెరియర్ను ప్రారంభించి ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తమకు వచ్చిన విపరీతమైన క్రేజీతో హీరోయిన్గా కూడా అవకాశం అందుకొని దూసుకుపోతున్నారు.చిన్న వయసులోనే తమకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్న వాళ్ళు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ముద్దుగుమ్మ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లకే తోపు హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని వాళ్ల మనసులో స్థానం సంపాదించుకుంది. కానీ ఈ చిన్నది 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్ బారిన పడింది. అయిన కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది. హీరోయిన్ గా ఈ బ్యూటీ కెరియర్ తొలినాళ్లలోనే సైబర్ నేరగాళ్ల చేతిలో పడింది. ఆమె ఫోటోలు మరియు ఫేక్ వీడియోలు చిన్న వయసులోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఈ బ్యూటీ తనకు వచ్చిన ప్రతి సమస్యని ఎదుర్కొని ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా బిజీగా గడుపుతుంది. ఈ నటి పేరు అనిక సురేంద్రన్. అనికా సురేంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈమె కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూతురిగా విశ్వాసం సినిమాతో బాగా ఫేమస్ అయింది. అజిత్ హీరోగా నటించిన విశ్వాసం సినిమా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధించింది.ఈ ఒక్క సినిమాతోనే ఈ చిన్నది విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 16 ఏళ్ల అతి చిన్న వయసులో ఫేక్ వీడియోస్ బారిన పడింది. కానీ ఆ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఫేక్ అని తేలిపోయాయి. ఆ తర్వాత ఈ చిన్నది 18 ఏళ్ల చిన్నవయసులోనే హీరోయిన్గా కూడా సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బుట్ట బొమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం అనిక సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను నిత్యం షేర్ చేస్తూ ఉంటుంది.