https://oktelugu.com/

టీజర్ టాక్: ‘చావుకబురు’తో చల్లగా చెప్పి రెచ్చిపోయిన కార్తీకేయ

‘ఆర్ఎక్స్-100’ మూవీతో కార్తీకేయ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో కార్తీకేయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన భగ్నప్రేమికుడిగా కార్తీకేయ నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీకేయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కార్తీకేయ హీరోగా నటిస్తూనే విలన్ వేషాలు వస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరో కార్తీకేయ తాజాగా ‘చావుకబురు చల్లగా’ మూవీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ మూవీని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 01:42 PM IST

    chavukaburu challaga copy

    Follow us on

    ‘ఆర్ఎక్స్-100’ మూవీతో కార్తీకేయ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో కార్తీకేయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన భగ్నప్రేమికుడిగా కార్తీకేయ నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీకేయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కార్తీకేయ హీరోగా నటిస్తూనే విలన్ వేషాలు వస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

    హీరో కార్తీకేయ తాజాగా ‘చావుకబురు చల్లగా’ మూవీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. కార్తీకేయ పుట్టిన రోజు సందర్భంగా ‘చావుకబురు చల్లగా’ నుంచి టీజర్ రిలీజ్ అయింది. చాలా ఎమోషన్ తో కూడిన కథలో కార్తీకేయ కామెడీని అద్భుతంగా పండించాడు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగులోకి దూసుకెళుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

    ఈ మూవీలో కార్తీకేయకు జోడీగా ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి ఆమని.. శ్రీకాంత్ అయ్యంగర్.. మహేష్.. భద్రం తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ అదిరిపోయే బాణీలను సమకూర్చాడు. సునీల్ రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ షూటింగు జరుగుతున్న సమయంలోనే కరోనా రావడంతో సినిమా నిలిచిపోయింది.

    ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ‘చావుకబురు చల్లగా’ టీజర్ ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. చాలారోజులు తర్వాత కార్తీకేయ మరో ఢిపరెంట్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియెన్స్ ను పక్కా ఎంటటైన్మెంట్ చేస్తుందనే టాక్ విన్పిస్తోంది. ‘చావుకబురు చల్లగా’ మూవీ కార్తీకేయ మరో బంపర్ హిట్టిచ్చేలా కన్పిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

    ట్రైలర్
    https://www.youtube.com/watch?time_continue=1&v=DpXywMBkbRI&feature=emb_title