Champion 1st Day Collections: ‘పెళ్లి సందడి’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్(Roshan Meka), తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. కుర్రాడు చూసేందుకు హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు, డాన్స్ బాగా వేస్తున్నాడు, యాక్టింగ్ కూడా బాగుంది, కచ్చితంగా ఇతను ఇదే ఊపులో మంచి సినిమాలు చేస్తూ, టాలీవుడ్ లో స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడతాడు అని అంతా అనుకున్నారు. కానీ ‘పెళ్లి సందడి’ తర్వాత ఈ హీరో రెండవ సినిమా ‘ఛాంపియన్'(Champion Movie) విడుదల అయ్యేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. నిన్న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి అటు పాజిటివ్ టాక్ రాలేదు, అదే విధంగా నెగిటివ్ టాక్ కూడా రాలేదు. డివైడ్ టాక్ వచ్చింది. అందుకే ఓపెనింగ్స్ పై పెద్ద ప్రభావం ఏమి చూపలేదు. ట్రైలర్ ఆసక్తి కరంగా ఉండడం తో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ పడింది.
మొదటి రోజు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 70 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రానికి 75 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ కి కూడా ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. క్రిస్మస్ రోజున విడుదల అవ్వడం కూడా ఈ చిత్రానికి పాజిటివ్ అయ్యింది. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 4 కోట్ల 20 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అని తెలుస్తోంది.
ఇక షేర్ విషయానికి వస్తే రెండు కోట్ల 20 లక్షల వరకు ఉండొచ్చని అంటున్నారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 12 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తోంది. అంత రేంజ్ లో ఈ సినిమా స్టడీ గా వెళ్లాలంటే, కచ్చితంగా రెండవ రోజు నుండి కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవ్వాలి. కానీ ఎందుకో ఈ చిత్రానికి రెండవ రోజున అనుకున్నంత స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో గంటకు వెయ్యి టికెట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి. నిన్న 70 వేల టిక్కెట్లు అమ్ముడుపోతే, నేడు కనీసం అందులో సగం కూడా అమ్ముడుపోయేలా కనిపించడం లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.