Champion Collections: కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ పెద్దగా రాకపోయినా కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలా రీసెంట్ గా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన రెండవ చిత్రం ‘ఛాంపియన్'(Champion Movie) కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘పెళ్లి సందడి’ చిత్రం తర్వాత రోషన్ దాదాపుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తీసుకొని చేసిన చిత్రమిది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం కావడం తో పాటు, విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడం తో భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ, డైరెక్టర్ బాగా ల్యాగ్ చేసాడు, సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు అనే టాక్ వినిపించింది. మొదటి నుండే ఇలాంటి సినిమాలకు జనాలు తక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, పైగా ఇలాంటి డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి , ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తుడిచిపెట్టుకుపోతుంది అని అంతా అనుకున్నారు.
కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్తోంది. నిన్న న్యూ ఇయర్ కావడం తో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కోటి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 8వ రోజు ఈ చిత్రానికి కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. డివైడ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. ‘గిర్రా గిర్రా గింగిరానివే’ పాట బాగా హిట్ అవ్వడం ఈ సినిమా థియేట్రికల్ రన్ కి కొంతమేరకు ఉపయోగపడింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా 8 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసిన ఈ చిత్రానికి 14 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
షేర్ వసూళ్లు దాదాపుగా 7 కోట్ల 15 లక్షలు ఉంటుంది. విడుదలకు ముందు ఈ సినిమాకు 11 కోట్ల రూపాయలకు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డీసెంట్ రేంజ్ వసూళ్లు వస్తాయి కాబట్టి, ఫుల్ రన్ లో కచ్చితంగా పధి కోట్ల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యినట్టే. గమ్మత్తు ఏమిటంటే, రోషన్ మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ కి కూడా ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది , కానీ బాక్స్ ఆఫీస్ పరంగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రెండవ సినిమా ‘ఛాంపియన్’ కి కూడా అదే ఫీట్ రిపీట్ అవ్వడం నిజంగా అదృష్టమే.