Samantha: సమంత- నాగ చైతన్య విడాకుల ప్రకటన చేసి దాదాపు రెండు మాసాలు అవుతుంది. ఈ రెండు నెలల కాలంలో అనేక వివాదాలు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విడాకుల విషయంలో సమంతను మీడియా కార్నర్ చేసింది. పెళ్లి తర్వాత ఆమె చేసిన సినిమాలు, డ్రెస్సింగ్ స్టైల్, పరాయి పురుషులతో స్నేహాలు వంటి విషయాలు పరిగణలోకి తీసుకొని… విడాకులకు సమంత ప్రవర్తనే కారణం అంటూ కథనాలు వెలువడ్డాయి.

ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకున్నారని పుకార్లు చెలరేగాయి. ఆమె పర్సనల్ స్టైలిష్ట్, ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో ఉన్న సన్నిహిత సంబంధమే విడాకులకు దారి తీసిందని మరొక వాదన తెరపైకి వచ్చింది. ఈ కథనాలకు సమంత సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పారు. విడాకుల కారణంగా మానసిక వేదన అనుభవిస్తున్న నన్ను, నిరాధార కథనాలతో మరింత ఇబ్బంది పెట్టవద్దని,సమంత అభ్యర్థించడం జరిగింది.
Also Read: Shivakartikeyan: ఈ స్టార్ హీరో ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
వాస్తవం ఏదైనా కానీ, టాలీవుడ్ క్రేజీ కపుల్ అనూహ్య రీతిలో విడిపోయారు. విడాకులతో చైతూకి సమంత దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఆమె శరీరంపై అలానే ఉన్నాయి. సమంత నాగ చైతన్య పేరును ఎడమ రిబ్ క్రింద పచ్చ బొట్టుగా వేయించుకున్నారు. అలాగే ఆమె వీపుపై ఆయనతో చేసిన ఆమె మొదటి సినిమా టైటిల్ షార్ట్ కట్ వై ఎం సి (ఏమాయ చేశావే) వేయించుకున్నారు. ఈ రెండు టాటూలు ఆమె ఒంటిపై ఇంకా అలానే ఉన్నాయి. తాజాగా సమంత జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయగా… ఆమె ఒంటిపై టాటూలు కనిపించాయి. అయితే సమంత వీటిని తొలగించే ప్రయత్నాలలో ఉన్నారని సమాచారం.
Also Read: Pushpa: ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ వచ్చేసింది… మాస్ బీట్తో దుమ్మురేపుతున్న బన్నీ!