Gama Awards: కోవిడ్ తో గత మూడు సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న గామా అవార్డ్స్ ఈ సంవత్సరం ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు సెలబ్రెటీలు చాలా మంది హాజరయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన స్టైల్స్ తో అలరించారు. ఇక ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ఎం.ఎం. కీరవాణి, గేయరచయిత చంద్రబోస్ లకు ప్రత్యేకంగా గామా గౌరవ్ సత్కార్ అవార్డును అందించడంతో ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు హాజరైన బ్యూటీలను కూడా ఓ సారి చూసేయండి.
జాతిరత్నాలు సినిమాతో ఫుల్ ఫేమస్ అయినా ఫరియా అబ్దుల్లా గామా అవార్డ్సు లో మెరిసింది. ఈ వేడుకలో మంచి అట్రాక్షన్ గా నిలిచింది బ్యూటీ. ఫరియా అబ్దుల్లా నడుము మడతలతో నెవర్ బిఫోర్ అందాలను చూపించేసింది. ఈ పొడుగు కాళ్ల సుందరిని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత అందంగా కనిపించలేదంటే నమ్మండి. తళుక్కుమని మెరిసే డ్రెస్ తో జిగేల్ అనిపించే లుక్ లో ఫిదా చేసింది.
ఈ ఫంక్షన్ కు ఫరియానే కాదు సంయుక్త మీనన్, ఆషిక, డింపుల్ లు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ లో వరుస హిట్ లతో దూసుకొని పోతున్న సంయుక్త మీనన్ కూడా ఈ వేడుకకు హాజరైంది. ఈమె డ్రెస్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈమెను చూసిన నెటిజన్లు వావ్ సంయుక్త అదిరిపోయింది లే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ కూడా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఆషికా కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కు డాన్స్ చేసి అట్రాక్షన్ గా నిలిచింది. ఇలా ఈ బ్యూటీలందరితో గామా అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, వంటి వారు పాల్గొన్నారు.