Anchor Suma: షకీలా.. ఈ పేరులోనే ఒక మైకం ఉంటుంది. షకీలా.. ఆమెలోనే ఒక ప్రత్యేకత ఉంటుంది. శృంగార తారగా ఎనలేని కీర్తిప్రతిష్టలతో ప్రేక్షక లోకాన్ని తనదైన శైలిలో అలరించిన నేటి మేటి బోల్డ్ నటి. షకీలా సినిమాల్లో ఎంత బోల్డ్ నెస్ గా ఉంటుందో ఆమె బయట కూడా అంతే బోల్డ్ గా ఉంటుంది. ఆమెకు మొహమాటం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తోంది. అసలు ఎలాంటి బీడియం, ఎలాంటి ఆలోచనలు ఉండవు.

మీడియాకు ఎక్కువగా దొరకని షకీలా తాజాగా సుమ క్యాష్ షోకు వచ్చింది.. అయితే, ఈ షోలో సుమకు షకీలాకి మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా సుమ మాటల పై షకీలా అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్ అయింది. మామూలుగా సుమ చేస్తోన్న క్యాష్ షోలో ఒక ఆనవాయితీ ఉంది. ఎవరైనా ఎంట్రీ ఇచ్చే సమయంలో డ్యాన్సులు వేస్తూ స్టేజ్ పైకి వస్తారు.
ఈ క్రమంలో షకీలా కూడా ఎంట్రీ ఇవ్వాలని.. రెండు స్టెప్పులు వేయాలని సుమ కోరింది. అయితే, సుమ మాటలకు షకీలా సీరియస్ అయింది. ‘క్యాష్ షో అని చెప్పారు. డ్యాన్స్ గురించి చేపలేదుగా ? అసలు నేనెందుకు స్టెప్పులు వేయాలి ? వేయను. ఇలా నేను వెళ్ళిపోతాను, అని ఆ షో డైరెక్టర్ వైపు చూస్తూ కట్ చేయండి’ అని షకీలా మొత్తానికి ఎమోషనల్ అయింది.
అయితే, షకీలా ప్రవర్తన చూసిన సుమకు ఏమి చేయాలో తెలియక అలాగే షాక్ గా చూస్తూ ఉండిపోయింది. షకీలా హర్ట్ అయిందని అందరికీ అర్ధం అయింది. మరోపక్క సుమ కూడా తెల్లమొహం తో చూస్తూ లోలోపల చిరాకు పడినట్టు అనిపించింది. ఇక మధ్యలో డైరెక్టర్ వచ్చి.. ఇద్దర్నీ కూల్ చేసాడట. కాకపోతే ఆ కూల్ చేసే షాట్స్ ను షోలో పెట్టలేదు. ఇక జరిగిన గొడవను తెలివిగా ఎండ్ చేస్తూ.. షకీలా చేత చివర్లో ఒక డైలాగ్ చెప్పించారు.

‘నా కొడుకుని పిలిస్తే వాడు డ్యాన్స్ వేస్తాడు’ అని షకీలా చెబుతుంది. ‘మీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు ?’ అని సుమ అర్ధం కానట్టు చూడగానే.. షకీలా కొడుకుగా సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలిలో రెండు స్టెప్స్ వేశాడు. మొత్తానికి షకీలా సీరియస్ నెస్ బాగానే వర్కౌట్ అయినట్టు ఉంది. ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.
‘షకీలా..’ అప్పట్లో తన అంగాంగ ప్రదర్శనలతో ఒక ఐటమ్ భామగా తనకంటూ ప్రత్యేకమైన అభిమాన సంఘాలను సంపాదించుకుంది. అదీ స్టార్ హీరోలకు పోటీగా. ఒకప్పుడు మలయాళ సూపర్ స్టార్, మెగాస్టార్ కూడా షకీలా సినిమాకి పోటీగా సినిమాని రిలీజ్ చేసే ధైర్యం చేసేవారు కాదు అంటేనే.. షకీలా గతం ఎంత వైభవంగా గడిచిందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం షకీలా కష్టాల్లో ఉంది.
Also Read: వెంకీతో ఎన్టీఆర్ బావమరిది.. సెట్ అవుతుందా ?