బిగ్ బాస్ బ్యూటీపై కేసు నమోదు చేసిన పోలీసులు!

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్-3 బ్యూటీ శ్రీముఖిపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి ఆమెపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజార హిల్స్ పోలీసులు శ్రీముఖిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు శ్రీముఖిపై ఎందుకు కేసు నమోదు చేశారనే అంశం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ ఏం చేయబోతున్నారు? తెలుగు టీవీ టాప్ యాంకర్లో శ్రీముఖి ఒకరు. ఎన్నో టీవీ షోలు, రియాల్టీ షోలు నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంది. […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 7:31 pm
Follow us on


ప్రముఖ యాంకర్, బిగ్ బాస్-3 బ్యూటీ శ్రీముఖిపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి ఆమెపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజార హిల్స్ పోలీసులు శ్రీముఖిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు శ్రీముఖిపై ఎందుకు కేసు నమోదు చేశారనే అంశం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

తెలుగు టీవీ టాప్ యాంకర్లో శ్రీముఖి ఒకరు. ఎన్నో టీవీ షోలు, రియాల్టీ షోలు నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాకుండా నాగార్జున్ హోస్ గా చేసిన బిగ్ బాస్-3లో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ఈ షోలో బిగ్ బాస్-3 విన్నర్ కు ఏమాత్రం తీసిపోనివిధంగా అందరినీ ఆకట్టుకుంది. టీవీ షోల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, గ్లామర్ షోతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న కామెడీ షోలో బ్రహ్మణులను కించపరించదంటూ నల్లకుంటకు చెందిన వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!

ఈమేరకు సదరు వ్యక్తి ఆ టీవీ ఛానల్లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్స్ పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. టీవీ ఛానల్ యజమానితోపాటు కామెడీ షో నిర్వాహాకులు, యాంకర్ శ్రీముఖిపై అతడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివాదంపై శ్రీముఖి ఏవిధంగా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే..!