Ravi Teja, Ram Pothineni : హీరో రవితేజ, రామ్ పోతినేని వరుస డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. మిస్టర్ బచ్చన్ మొదటి రోజు కలెక్షన్లు 7 కోట్లు. ఆ తర్వాత రోజుల్లో కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. రవితేజ కథలు ఎంచుకోవడంలో చేస్తున్న తప్పులు ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తున్నాయి.
రవితేజ కి ఉన్న మాస్ ఇమేజ్, క్రేజ్ కి.. చేస్తున్న సినిమాలకు సంబంధమే ఉండటం లేదు. గత పదేళ్లుగా రవితేజ కి పడింది నాలుగు హిట్లు మాత్రమే. క్రాక్, ధమాకా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ ఇలా హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత మిస్టర్ బచ్చన్ మరో డిజాస్టర్ అయింది. ఇలానే పరిస్థితి కొనసాగితే రవితేజ కెరీర్ రానున్న కాలంలో కష్టం అంటున్నారు.
మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన అభిమానులు సైతం చాలా బాధ పడుతున్నారు. స్టోరీ సెలక్షన్ లో రవితేజ కొన్ని తప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హీరో రామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్. దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామ్ ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలింది.
రామ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే లవర్ బాయ్ సినిమాలు వదిలేసి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇది కాస్త బెడిసి కొట్టింది. మాస్ యాక్షన్ జోనర్ లో వచ్చిన వారియర్, స్కంద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో హ్యాట్రిక్ ప్లాప్స్ కొట్టాడు. పైగా నిర్మాత ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక నష్టాల నుంచి డబుల్ ఇస్మార్ట్ గట్టెక్కిస్తుంది అని భావించారు.
కానీ ఈ సినిమా ఫలితాలు అందుకు వ్యతిరేకంగా వచ్చాయి . మంచి హిట్ ఇస్తుంది అనుకుంటే డబుల్ ఇస్మార్ట్ రామ్ కెరీర్ కి మరో మైనస్ అయింది. హిట్ కోసం రామ్ స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రస్తుతం రామ్ కి కమర్షియల్ హిట్ చాలా అవసరం. ఓ మంచి లవ్ స్టోరీలో రామ్ ని చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. రామ్ గత సినిమాలు, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ఫలితాలపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా కధలు ఎంచుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రవితేజ 75వ చిత్రం మీదే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ల్యాండ్ మార్క్ మూవీతో మాస్ మహారాజ్ భారీ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాగా రామ్ పోతినేని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది. స్కంద డిజాస్టర్ కావడంతో బోయపాటి శ్రీను స్కంద 2ని పక్కన పెట్టేశాడు.
Web Title: Career of heroes ravi teja ram pothineni in danger a series of flops market dhamal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com