Prashanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన వాళ్లలో ప్రశాంత్ వర్మ ఒకరు…హనుమాన్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించిన ఆయన ఆ తర్వాత సినిమాలు చేయకుండా ఒక కొత్త బ్యానర్ ను స్థాపించి అందులో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చాలామంది తో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నప్పటికి అవేవి కార్యరూపం దాల్చడం లేదు. ఇక ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమాని కూడా స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటివరకు అది పట్టలెక్కలేదు.
రిషబ్ శెట్టి ఇందులో హనుమాన్ పాత్రను పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రిషబ్ శెట్టి రీసెంట్ గా ‘కంతార చాప్టర్ వన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక అతను సాధించిన సక్సెస్ తో తన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రశాంత్ వర్మ తొందరలోనే జై హనుమాన్ సినిమాను సెట్స్ మీద తీసుకొస్తున్నాను అంటూ అనౌన్స్ చేశాడు.
ఇక ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తో స్టార్ హీరోలు సినిమాలు చేసే అవకాశమైతే లేదు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ తరచుగా కాంట్రవర్సీ లలో ఇరుక్కుంటున్నాడు. ఇక తను సినిమాలు చేయకుండా ప్రొడక్షన్ వైపు ఎక్కువ దృష్టి పెడుతుండడం వల్ల అతనితో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు. బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞతో సినిమా చేస్తానని చెప్పి మధ్యలో హ్యాండ్ ఇచ్చి వదిలేసాడు. దాంతో బాలయ్య బాబు సైతం అతని మీద చాలా వరకు సీరియస్ అవుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే తన వైఖరిని మొత్తం మార్చుకొని డైరెక్షన్ మీద తన పూర్తి ఫోకస్ పెడితే తప్ప అతనికి మంచి అవకాశాలైతే రావు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ప్రశాంత్ వర్మ తనను తాను మార్చుకుంటాడా లేదా అనేది…