Trivikram: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…తన రేటింగ్ కి, తన మేకింగ్ కి, స్క్రీన్ ప్లే కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బోల్డ్ సీన్స్ తో సైతం సూపర్ సక్సెస్ ని సాధించొచ్చు అని నిరూపించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…2023 వ సంవత్సరంలో రన్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టాడు… అలాంటి సందీప్ రెడ్డి వంగ సినిమాలు సక్సెస్ అవ్వడం లో మ్యూజిక్ అనేది కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సందీప్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అనిమల్ సినిమాలో సాంగ్స్ ఎంత పాపులారిటి ని సంపాదించుకున్నాయో, గ్రౌండ్ స్కోర్ అంతకుమించిన గుర్తింపును సంపాదించుకుంది. ఇక సందీప్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడని సందీప్ సైతం కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు…అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ సినిమాలను చేస్తుండడం విశేషం… వీళ్లిద్దరూ ఒకప్పుడు టాప్ డైరెక్టర్లుగా వెలుగొందిన విషయం మనకు తెలిసిందే.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరు దర్శకులకు చాలా మంచి క్రేజ్ ఉంది. ఇక అలాగే వీళ్ళకు మ్యూజిక్ లో చాలా మంచి పట్టు ఉంది… ఈ దర్శకులు ఇప్పుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ను తమా సినిమాలకు ఎలా వాడుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా త్రివిక్రమ్ విషయానికి వస్తె ఆయనకి సాహిత్యం మీద చాలా మంచి గ్రిప్ ఉంది కాబట్టి హర్ష వర్ధన్ తో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు.
ఇక సందీప్ రెడ్డి వంగ ఎలాగైతే తనకు ఇన్పుట్స్ ఇచ్చి హర్షవర్ధన్ రామేశ్వర్ నుంచి క్వాలిటీ మ్యూజిక్ ని రాబట్టుకున్నాడో ఇప్పుడు త్రివిక్రమ్ సైతం అలానీ చేస్తాడా? తన సినిమాలోని కంటెంట్ మొత్తాన్ని హర్షవర్ధన్ కు తెలియజేసి బెస్ట్ అవుట్ తీసుకురాగలుగుతాడా.? సందీప్ రెడ్డి వంగ రేంజ్ లోనే మ్యూజిక్ ని హైలైట్ చేసే విధంగా సన్నివేశాలను చిత్రీకరిస్తాడా? బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి హర్షవర్ధన్ రామేశ్వర్ కి స్పేస్ ని కల్పిస్తాడా? అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. త్రివిక్రమ్ సినిమాలో అక్కడక్కడా ఎలివేషన్ అయితే కనిపిస్తుంది. మరి అలాంటి ఎలివేషన్స్ లో హర్షవర్ధన్ రామేశ్వర్ ఎలా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు. త్రివిక్రమ్ మాటలకు హర్షవర్ధన్ మ్యూజిక్ తోడవుతుందా? ఈ రెండు కలిపి వెంకటేష్ తో చేస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనే విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది…