
జక్కన్న చెక్కుతున్న శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరోలు రాం చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో వార్త లీక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోనే అతి భారీ పొడవైన పాటను చిత్రీకరించడానికి రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ పాట సుమారు 8 నిమిషాల పాటు ఉంటుంది. ఈ పాటలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తో విస్తృతంగా చిత్రీకరించబడుతుంది. తరువాత భారీ వీఎఫ్ఎక్స్ కూడా ఈ పాట కోసం వినియోగిస్తున్నారు.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాటను ఇద్దరు హీరోలపై చిత్రీకరించడానికి 20 రోజుల సమయం పడుతుంది. రాజమౌళి మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ఆర్టిస్టులు స్టోరీబోర్డ్ తయారు చేశారని తెలిసింది. వీఎఫ్ఎక్స్ నిపుణులు ఈ స్టోరీబోర్డ్ చిత్రాలతోనే పాటను అద్భుతంగా తీయటానికి రూపకల్పన చేస్తున్నారట..
ఈ చిత్రం అక్టోబర్-2021లో విడుదలవుతుందని కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇది సంక్రాంతి సీజన్ లేదా 2022 వేసవిలో మాత్రమే రావచ్చని టాలీవుడ్ వర్గాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. హీరోలకు రాజమౌళి నుంచి సమాచారం కూడా ఉందని తెలుస్తోంది.