Ram charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇప్పటికే రెండు సినిమా షూటింగులు దాదాపు ముంగిపు దశకు చేరుకున్నాయి. మరోవైపు త్వరలోనే దర్శకుడు శంకర్‌తో కలిసి మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు రామ్‌చరణ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. కాగా, ఇందులో చెర్రీ పాత్రపై అనేక ఆసక్తికర విషయాలు నెట్టింట ప్రచారం అవుతున్నాయి.

తాజాగా, రామ్‌చరణ్ తేజ్ ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లో చరణ్ సూటు కోటుతో స్టైలిష్‌గా కనిపించారు. మరి చెర్రీ పాత్ర ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూాడాల్సిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. వచ్చే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
రోబో 2.0 తో భారీ ఓటమి చవిచూసిన శంకర్.. ఈ సినిమాతోనైనా విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. మరోవైపు భారతీయుడు 2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు శంకర్. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’లో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, మనోబాల తదితరులు నటిస్తున్నారు.